Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

ప్రపంచ జనాభాలో దాదాపు 84 శాతం మంది ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. దీంతో ఇవి హ్యాకర్లకు టార్గెట్ గా మారాయి.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 03:51 PM IST

ప్రపంచ జనాభాలో దాదాపు 84 శాతం మంది ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. దీంతో ఇవి హ్యాకర్లకు టార్గెట్ గా మారాయి. గత సంవత్సరం, సైబర్ సెక్యూరిటీ కంపెనీ Kaspersky మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో దాదాపు 3.5 మిలియన్ల హానికరమైన సైబర్ దాడులను గుర్తించింది. టెక్స్ట్ సందేశాలు లేదా ఇమెయిల్‌ల ద్వారా మన ఫోన్‌ కు వచ్చే స్పామ్ మెసేజ్ ల ద్వారా తరచుగా వైరస్‌కు లింక్‌ లు వస్తుంటాయని నివేదిక ద్వారా పేర్కొంది.

ప్రైవేట్ కంపెనీ Zimperium నివేదిక ప్రకారం, ప్రతి ఐదు మొబైల్ పరికరాల్లో ఒకటి కంటే ఎక్కువ మాల్వేర్‌కు గురవుతున్నాయట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పది మొబైల్‌లలో నాలుగు సైబర్ దాడులకు గురవుతున్నాయి. అయితే మీ ఫోన్ టార్గెట్ అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? పర్సనల్ కంప్యూటర్‌ల మాదిరిగానే ఫోన్‌లు కూడా మాల్‌వేర్‌ వల్ల పాడవుతుంటాయా…తెలుసుకుందాం.
ఫోన్ వైరస్ కంప్యూటర్ వైరస్ లాగా పనిచేస్తుంది

ఉదాహరణకు, 2016లో హమ్మింగ్‌బాద్ వైరస్ కోటి స్మార్ట్ ఫోన్లకు సోకింది. కొన్ని నెలల్లోనే 8 కోట్ల స్మార్ట్ ఫోన్లను పూర్తిగా పాడుచేసింది. సాధారణంగా, ఫోన్ వైరస్ కంప్యూటర్ వైరస్ లాగానే పనిచేస్తుంది. హానికరమైన వైరస్ కోడ్ మీ పరికరానికి సోకినప్పుడు, అది ఆటోమేటిగ్గా మెసేజ్ లు పంపడం లేదా మీ కాంటాక్టు లిస్టులోని వారికి ఇమెయిల్‌ ద్వారా ఇది ఇతర పరికరాలకు వ్యాపిస్తుంది.

అంతేకాదు ఫోన్లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు పంపుతుంది. మీ పరిచయాలకు మాల్వేర్‌ను లింక్ చేసే స్పామ్ సందేశాలను పంపవచ్చు. మీ స్క్రీన్, కీబోర్డ్ ఇన్‌పుట్‌ను క్యాప్చర్ చేయడం ద్వారా మీ పాస్ వర్డ్స్ తెలుసుకొని హ్యాకర్లు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును సైతం కాజేసే వీలుంది.

Apple, Android రెండింట్లో ఏది సురక్షితం ?

యాపిల్ పరికరాలు సాధారణంగా ఆండ్రాయిడ్ కంటే ఎక్కువ సురక్షితమైనవిగానూ, వైరస్ దాడులకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఐఫోన్లు సైతం ఈ మధ్య కాలంలో విపరీతంగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. అదేవిధంగా, గూగుల్ ప్లే స్టోర్ కాకుండా బయటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాల్వేర్‌ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్. ఆండ్రాయిడ్ రెండూ హ్యాకింగ్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, ఫోన్ వినియోగదారులందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

వైరస్ సోకిందని ఇలా గుర్తించండి
మీ ఫోన్‌కు వైరస్ సోకిందో లేదో చెప్పడం సులభం కానప్పటికీ, అది వైరస్ బారిన పడినట్లయితే యాప్‌లను తెరవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. మొబైల్ డేటా వినియోగం పెరుగుతుంది.

మీ పరికరానికి వైరస్ సోకినట్లు మీరు అనుమానించినట్లయితే, మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి మాల్వేర్ ను తీసివేయాలి. ఇక్కడ కొన్ని సాధారణ ట్రబుల్ షూటింగ్ దశలు ఉన్నాయి, మీ ఫోన్‌ని స్కాన్ చేయడానికి నమ్మకమైన యాంటీవైరస్ యాప్‌ని ఉపయోగించండి. అవాస్ట్, AVG, Bitdefender, McAfee, Nortone ప్రముఖంగా ఉన్నాయి.