Zomato UPI- Paytm: పేటీఎం లాంటి యాప్‌లకు షాక్.. జొమాటో కొత్త యూపీఐ సర్వీసులు

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నగదు లావాదేవీల్లోనూ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఆన్ లైన్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ సేవలు బాగా పెరిగిపోయాయి.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 11:36 PM IST

Zomato UPI- Paytm: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నగదు లావాదేవీల్లోనూ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఆన్ లైన్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ సేవలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు నగదు ట్రాన్సాక్షన్లు అన్నీ డిజిటల్ గానే జరుగుతున్నాయి. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకు లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు అనేక యూపీఐ యాప్ లో పుట్టుకొచ్చాయి.

పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ లో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. అదే జొమాటో యూపీఐ యాప్. జొమాట్ అనగానే మనకి ఫుడ్ గుర్తుకొస్తుంది. ఫుడ్ డెలివరీ చేసే జొమాటో ఇప్పుడు పేటీఎం, గూగుల్ పే తరహాలో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ అయిన పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు ధర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా జొమాటా సొంతంగా యూపీఐ సర్వీసును ప్రవేశపెట్టింది. దీంతో ఇక నుంచి థర్డ్ పార్టీ యాప్స్ తో సంబంధం లేకుండా జొమాటో యూపీఐ ద్వారా నగదు చెల్లించవచ్చు. తమ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడకుండా ఉండేందుకు జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐతో జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. జొమాటో యూపీఐ సేవలను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఐసీఐసీఐ యూపీఐ ఐడీన క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా జొమాటో ఈ యూపీఐ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలో కస్టమర్లు అందరికీ ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.