Nikhat Zareen The Champ: షార్ట్స్ వేసుకోవద్దని ఎగతాళి చేశారు..కానీ నేడు దేశాన్ని గర్వించేలా చేసింది..!

భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్..ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనక 12ఏండ్ల కృషి ఉంది. నిఖత్ జరీన్ ఒక్క విజయంతో తన కుటుంబాన్నే కాదు మొత్తం దేశాన్నే గర్వపడేలా చేసింది.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 12:22 PM IST

భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్..ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనక 12ఏండ్ల కృషి ఉంది. నిఖత్ జరీన్ ఒక్క విజయంతో తన కుటుంబాన్నే కాదు మొత్తం దేశాన్నే గర్వపడేలా చేసింది.

నిఖత్ జరీన్…సాధారణ సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం వచ్చింది. తన చరిత్రను తానే రాసుకుంది. నిఖత్ కు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం అందింది. నిఖత్ తండ్రి మహ్మద్ జమీల్…నిజామాబాద్ వాసి. ఆయన మాజీ ఫుట్ బాల్ , క్రికెట్ ప్లేయర్. జమీల్ కు నలుగురు కుమార్తెలు. వారిలో ఒకరిని క్రీడాకారిణిగా చూడాలనుకున్నాడు. ఆయన కోరిక మేరకు మూడో కుమార్తె నిఖత్ జరీన్ అథ్లెటిక్స్ ను ఎంచుకుంది. రెండు స్ప్రింట్ ఈవెంట్స్ లో రాష్ట్ర ఛాంపియన్ గా నిలిచింది. కానీ తన మామయ్య సలహా మేరకు బాక్సింగ్ లోకి అడుగుపెట్టింది నిఖత్. 14 ఏళ్ల వయస్సు నుంచి నిఖత్ బాక్సింగ్ ట్రైనింగ్ ప్రారంభించింది. ఆరు నెలల్లోపై స్టేట్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. పంజాబ్ తో జరిగే రూరల్ నేషనల్స్ కు ఎంపికైంది.

ఆ తర్వాత మూడు నెలల్లోనే నిఖత్ బెస్ట్ బాక్సర్ గా మారింది. సబ్ జూనియర్ నేషనల్స్ కూడా గోల్డ్ మెడల్ పొందింది. తర్వాత నిఖత్ వైజాగ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్యాంపులో చేరింది అక్కడ తనకు ద్రోణాచార్య వెంకటేశ్వరరావు శిక్షణ ఇచ్చారు.

ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లో స్వర్ణం గెలవడం అనేది ముస్లిం బాలికలతో పాటు దేశంలోని ప్రతి అమ్మాయి జీవితంలో లక్ష్యం సాధించాలనే స్పూర్తినిస్తుంది. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ తనేం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని స్వంత మార్గాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని జరీన్ తండ్రి జమీల్ అంటున్నారు.
నిఖత్ మేనమామ కుమారులు ఇద్దరూ బాక్సర్లు కావడంతో..నిఖత్ కు వారే ప్రేరణగా నిలిచారు. అప్పటివరకు హైదరాబాద్ లోకానీ..నిజామాబాద్ లో కానీ మహిళా బాక్సర్లను చూడలేదు. అయినప్పటికీ తన కూతరు బాక్సింగ్ లో రాణించేందుకు తన వంతు క్రుషి చేశారు. అయితే ఈ క్రీడల్లో అమ్మాయిలు షార్ట్ లు, ట్రైనింగ్ షర్ట్స్ ధరించడం అనేది అంత సులభం కాదు. ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో మరింత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె తల్లి పర్వీన్ సుల్తానాతోపాటు తోబుట్టువులు కూడా నిఖత్ కు మద్దతుగా నిలిచారు. 2011లో టర్కీకి చెందిన ఉల్కు డెమిర్ ను ఓడించి ప్రపంచ యూత్ ఛాంపియన్ గా నిలిచింది.

నిఖత్ ఇద్దరు అక్కలు డాక్టర్లు కాగా…చెల్లెలు బ్యాడ్మింటన్ లో రాణిస్తోంది. నిఖత్ బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు తనను ప్రోత్సాహించాను. కానీ కొన్ని సార్లు బంధువులు, స్నేహితులు అమ్మాయి పొట్టి డ్రెస్సులు ధరించే క్రీడలు ఆడకూడదు అని అంటుండే వారు. కానీ నిఖత్ ఏదీ కోరకున్నా…మేము ఆమెకు మద్దతుగా నిలిచామని నిఖత్ జమీల్ అన్నారు. 2014లో నిఖత్ కుుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 50 లక్షణల ప్రోత్సాహకాన్ని అందించారు. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ పతకాలు గెలిచినా సర్కార్ నుంచి ఎలాంటి బహుమతులూ అందలేదు. ప్రస్తుతం తనకు 25 సంవత్సరాలే కాబట్టి బాక్సింగ్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంది.