Smart Phones: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? నో డౌట్ స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయినట్లే!!

స్మార్ట్ ఫోన్ మానవజీవితంతో ఎంతగా ముడిపడి ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకపూట భోజనం మానేస్తారు కానీ ఫోన్ చూడంది మాత్రం ఉండలేరు.

  • Written By:
  • Publish Date - February 28, 2022 / 08:06 AM IST

స్మార్ట్ ఫోన్ మానవజీవితంతో ఎంతగా ముడిపడి ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకపూట భోజనం మానేస్తారు కానీ ఫోన్ చూడంది మాత్రం ఉండలేరు. అంతలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తులు ఈ సమాజంలో లేరనే చెప్పాలి. అవును ఇప్పుడు నడుస్తోందా స్మార్ట్ ఫోన్ కాలమే. స్మార్ట్ ఫోన్ ఒక నిమిషం కూడా వదలని వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే దీని మాయలో పడి…బానిసలుగా మారిన వారు చాలా ఉన్నారు.

మనుషుల మధ్య బంధత్వాల కంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తోనే ఎక్కువ సంబంధాలను ఏర్పారుచుకుంటున్నారు. ముఖ్యంగా మనుషులు స్మార్ట్ ఫోన్లకు విడదీయలేని బంధం ఏర్పడింది. ఫోన్ లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారు. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ల బారిన పడ్డారు. ఫోన్ లేకుంటే ఒక నిముషం ఒక యుగంలా గడిపేస్తున్నారు. కొంతమందికి నిత్యవసర వస్తువుగా మారింది. రోజంతా తిండి, నీళ్లూ లేకున్నా సరే…కానీ చేతిలో ఫోన్ ఉండాలి. ఇది నమ్మలేని సత్యం. ఎంతో మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ విషయం వాళ్లకు తెలియకున్నా…ఇదే నిజమని ఏప్రిల్ లో నిర్వహించిన ఓ సర్వే లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు 81శాతం మంది ప్రజలువీడియో కాల్స్ ఉపయోగించారని సర్వేలో తేలింది.

ఈ 81శాతం మందిలో40శాతం మంది వీడియో కాల్స్ లో మాట్లాడి…ఫోన్ వాడకం ఎక్కువయ్యి అలసిపోయారన్న విషయాన్ని సర్వే తేల్చింది. ఇక 33శాతం మంది ప్రజలు తాము ఫోన్ తో గడిపిన లేదా ఇంటర్నెట్ లో ఎంత సేపు గడిపామో తెలుసుకునే ప్రయత్నం చేశారని సర్వే చెబుతోంది.

అయితే స్మార్ట్ ఫోన్ వాడకం అనేది చెడ్డ అలవాటు కాదు. ఫోన్లు మనిషి మనిషి మధ్య బంధాలను పెంచుతాయి. ఎన్నోవిధాలుగా స్మార్ట్ ఫోన్లు సంతోషపెడుతున్నాయి. కానీ ఏది అతిగా చేయకూడదు. అతిగా వాడితే వినాశనానికి దారి తీస్తుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి స్మార్ట్ ఫోన్లను లిమిట్ గా వాడాలి. అవసరం ఉన్నంత వరకే వాటిని ఉపయోగిస్తుండాలి. లేదంటో ఎన్నోసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి యాప్స్ ను చూసే అలవాటును క్రమక్రమంగా తగ్గించుకోండి. మితిమీరి వాడకం వల్ల మీతోపాటు అవతలి వ్యక్తులను కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని చూసి అవతలి వ్యక్తులు కూడా ఫోన్ కు బానిసగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక ఏవైనా అప్ డేట్స్ కోసం అదే పనిగా ఫోన్ వంక చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారు డూమ్ స్క్రోలింగ్ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఏం చేయాలి…?
సామాజిక మాధ్యమాలను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాకు కేటాయించకూడదు. ఉదయం లేచినప్పుడు పడుకునేటప్పుడు ఫోన్లను చేయడం చూడటం మానుకోవాలి. స్మార్ట్ ఫోన్లను చూసేకంటేనూ యోగా, వ్యాయామం వంటివాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దీంతో సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఆరోగ్యంగానూ ఉంటారు. పోషకాలుఎక్కువగా లభించే ఆహారాన్ని మీ డైట్ లోచేర్చుకోండి.

ఇక మొబైల్ ను ఎక్కువగా వాడుతున్నట్లు మీకు అనిపించినట్లయితే ఆలవాటును మానుకునేలా చేసుకోండి. ఇది మీ మెదడుకి చూసింది చాలన్న మెసేస్ చేరుతుంది. దీంతో మీరు ఫోన్ను ఎక్కువ సేపు చూడలేరు. చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లను దూరంగా ఉంచండి. ఈ అలవాటు వారిలో అంధత్వానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తూ వారిని గుడ్డివారిగా మారుస్తున్నారని వైద్యులు అంటున్నారు. కాబట్టి పిల్లలు, పెద్దలు స్మార్ట్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే…వారి ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు.