Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!

సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:32 PM IST

సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి. అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండం పెట్టు అంటూ డూడూబసవన్నలు చేసే విన్యాసం అంతా ఇంతా కాదు.. హైటెక్ యుగంలో హైదరాబాద్ లాంటి నగరంలో డూడు బసవన్నలు కనిపిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరగడంతో మనషుల అవసరాల కూడా మార్పు చెందుతున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపుల కాలం కావడంతో కొంతమంది గంగిరెద్దులవాళ్ల ఈ బసవన్న మెడలకు గూగుల్ పే, పేటీఎం కట్టి భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు దానం చేయాలనుకునేవాళ్లు.. పేటీఎం చేస్తూ.. ఇతోధికం సాయం చేస్తున్నారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఉండటంతో చాలా మంది డిజిటల్‌ పేమెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పారామం, బంజారాహిల్స్, మాదాపూర్ లాంటి ఏరియాలో డూడూ బసవన్నలు ఇలా పేటిఎం ట్యాగ్ లతో సందడి చేస్తున్నాయి.

బతుకు దుర్భరం

నేటికీ గంగిరెద్దుల కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పటి వరకు పెద్ద చదువులు చదివిన వారు కూడా లేరు. పెళ్లిళ్ల సీజన్‌ హైదరాబాద్‌ నుంచి పిలుపు వస్తే వాయిద్యం వెళ్లడమే తప్ప మిగతా రోజుల్లో ఏ పనికీ వెళ్లారు. గ్రామాల్లో ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా వీరు గంగిరెద్దు సాయంతో ఉపాధి పొందుతున్నారు. ఊరూరా తిరిగి వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటున్నారు.

గంగిరెద్దులు సంక్రాంతికే ప్రత్యేకం

ఆరుకాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో ఈ పండగ రావడంతో గ్రామీణ ప్రాతంలోని రైతులు ఇళ్లలలో ఆనందం వెల్లు విరుస్తుంది. తెలుగు వారి లోగిళ్లలో రంగు రంగుల హరివిల్లు వెలసిన ముగ్గులు, వాటిపై పసుపు, కుంకుమతో గొబ్బిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ముగ్గుల్లో గరక పోచలు, రేగుపళ్లు, నవధాన్యాల మరో అలంకరణ. ఈ నేపథ్యంలో గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికే ప్రత్యేకమని చెప్పొచ్చు. అయ్య గారికి దండం పెట్టు.. అమ్మ గారికి దండం పెట్టు.. అంటూ చెప్పే యాజమాని సూచనలకు అనుగుణంగా తల ఊపే బసవన్నలు కొత్త వస్త్రాల అలంకరణలో ఆకట్టుకుంటాయి.