Smart phones: మొబైల్ యాప్స్ పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా..? మీ ప్రైవసీకి ప్రమాదం..!!

స్మార్ట్ ఫోన్....మన జీవితంలో భాగమయ్యాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.

  • Written By:
  • Publish Date - February 22, 2022 / 08:01 AM IST

స్మార్ట్ ఫోన్….మన జీవితంలో భాగమయ్యాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే స్మార్ట్ ఫోన్ వాడకంలో ఎన్ని లాభాలున్నాయో….అంతకంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యాప్స్ విపరీతంగా ఉపయోగించినట్లయితే…పౌరుల వ్యక్తిగత గోప్యత, భద్రతకు భంగం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. లేటెస్టుగా లాంకాస్టర్, బాత్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు తెలిసాయి. మొత్తం 780మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సంబంధించిన 4,680రోజులు యాప్ మెసేజ్ డేటాను విశ్లేషించారు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిపుణులు.

యూనివర్సిటీ ఆఫ్ బాత్ ప్రొఫెసర్ డేవిట్ విశ్లేషణ ప్రకారం…మా అధ్యయనంలో ఒక్కో వ్యక్తికి సంబంధించి 6రోజుల యాప్ వినియోగ డేటాను పరిశీలించాం. ఈ అధ్యయనంలో అనేక సంచలన విషయాలు తెలిశాయి. ఈ డేటా ద్వారా వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లుతున్నట్లయి తేలింది. యాప్ లను విపరీతంగా వినియోగిస్తున్న వారిలో మూడింట ఒక వంతు యూజర్ల ప్రైవసీ దెబ్బతింటోందని తేలిందన్నారు. అంతేకాదు…యాప్ మెసేజ్ డేటా ద్వారా ఆయ వ్యక్తులకు సంబంధించిన ఐడెంటిటిని ఈజీగా గుర్తించవచ్చని తేలిందన్నారు. సైకలాజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం..యాప్స్ లో డేటాను బట్టి వ్యక్తులను గుర్తించడం ఈజీ అని తేలింది. ఇది సైబర్ నేరస్తులకు వరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్ యాప్స్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని….ఎలాంటి సున్నితమైన వివరాలు అందులో వెల్లడించవద్దని చెబుతున్నారు.

ఇక ఫేస్ బుక్ ను ఎక్కువగా వాడటం వల్ల కాలిక్యూలేటర్ యాప్ ను అతి తక్కువగా ఉపయోగించినట్లయితే యాప్ వినియోగ ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయని గుర్తించారు. ఒక యూజర్ కు సంబంధించి రెండు రోజుల పాటు స్మార్ట్ ఫోన్ డేటాను అనాలసిస్ చేయడం ద్వారా యూజర్ ఐడెంటిటిని బయటపెట్టాం. మా విశ్లేషణ ప్రకారం ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన రెండు రోజుల డేటా కంటే…ఒక వ్యక్తి యాప్ వినియోగ డేటాలో ఎక్కువ సిమిలార్టీ ప్రదర్శించాడని లాంకాస్టర్ యూనివర్సిటీకి చెందిన హీథర్ షా వెల్లడించారు. అందుకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ తో గడిపే యూజర్లు స్వయం చాలకంగా సేకరించే యాప్ వినియోగ డేటా మాత్రమే వ్యక్తి గుర్తింపు బయటపెడుతుందని గుర్తించాలి. డేటా దుర్వినియోగం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎక్కువగా భంగం వాటిల్లుతోందని పరిశోధకులు తేల్చారు.