Site icon HashtagU Telugu

Putin Win : మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. నాటోకు ‘వరల్డ్ వార్‌‌’ వార్నింగ్

Putin Agrees To China Visit

Putin

Putin Win : రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ఆదివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆయనకు బంపర్ మెజారిటీ వచ్చింది. దేశంలోని నమోదైన ఓట్లలో 87.8 శాతం పుతిన్‌కే పడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసిన మిగతా ముగ్గురు అభ్యర్థులకు ఓట్లు అంతంతే వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4 శాతంలోపు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మరో అభ్యర్థి వ్లాడిస్లావ్ దావన్కోవ్ మూడో స్థానంలో, అల్ట్రా నేషనలిస్ట్ లియోనిడ్ స్లట్స్కీ నాలుగో స్థానంలో నిలిచారు, దీంతో అధికార పీఠంపై పుతిన్‌కు మరింత పట్టు పెరిగింది. ఇంకో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతినే కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది. రష్యాను పాలించే విషయంలో గతంలో జోసెఫ్ స్టాలిన్‌ క్రియేట్ చేసిన రికార్డును కూడా పుతిన్(Putin Win) అధిగమించారు.

We’re now on WhatsApp. Click to Join

పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా వైఖరిని తీసుకోవడం, ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడం సరైనదే అని చెప్పేలా రష్యా ప్రజలు తీర్పు ఇచ్చారని పుతిన్ వర్గీయులు చెబుతున్నారు. 1999లో తొలిసారిగా రష్యాలో అధికారంలోకి వచ్చిన పుతిన్ నాటి నుంచి నేటి వరకు బలంగా వేళ్లూనుకున్నారు. ఒకప్పుడు రష్యా గూఢచర్య సంస్థ కేజీబీలో ఏజెంట్‌గా పుతిన్ పనిచేశారు. రష్యా ఎన్నికల ఫలితాలపై అమెరికా, బ్రిటన్ పెదవి విరిచాయి. రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టడం, సెన్సార్‌షిప్ చేయడం వంటి అన్యాయమైన చర్యల వల్ల ఎన్నికల్లో పుతిన్ మళ్లీ గెలిచారని మండిపడ్డాయి.

Also Read :Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?

విజయంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

పుతిన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రష్యా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. నాకు వ్యతిరేకంగా జరిగిన నావల్నీ ప్రేరేపిత నిరసనలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ప్రతిపక్ష నేత నావల్నీ మరణం విచారకరమైన సంఘటన. జైలులో ఉన్న రాజకీయ నాయకులకు  సంబంధించి ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. తిరిగి నేను ఎన్నిక కావడం ప్రజాస్వామిక నిర్ణయమే. అమెరికా రాజకీయ, న్యాయ వ్యవస్థలలో ప్రజాస్వామికత లేదు. అమెరికాలో ఏం జరుగుతుందో చూసి ప్రపంచం మొత్తం నవ్వుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్‌పై రాజకీయ దాడిని చేయడానికి పరిపాలనా వనరులను వాడుతున్నారు. న్యాయవ్యవస్థను ట్రంప్‌పైకి ఉసిగొల్పుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌పై నాలుగు క్రిమినల్ కేసులను పెట్టారు. ఉక్రెయిన్‌పై మేం దాడి చేయడం సరైనదే. ఇది ఇప్పటి విషయం కాదు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది.రష్యాపై పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సహించం’’ అని చెప్పారు. ‘‘నాటో దేశాలు రష్యా సరిహద్దుల్లో పిచ్చి చేష్టలు చేస్తే వాటిపైకి అణ్వాయుధాలు వేస్తాం. అలాంటి చేష్టలు చేసే ముందు మూడో ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నామని ఆ దేశాలు గుర్తుంచుకోవాలి’’ అని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read :Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు