e-Challan Scam : ఈ చలానా లింక్ మీకూ వచ్చిం దా.. క్లిక్ చేశారో ఇక అంతే..!

e-Challan Scam ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడం వల్ల ట్రాఫిక్ పోలీసులు మన బైక్ లేదా కారుకి చలానా వేస్తారని తెలిసిందే. అయితే ఎప్పుడు

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 06:41 PM IST

e-Challan Scam ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడం వల్ల ట్రాఫిక్ పోలీసులు మన బైక్ లేదా కారుకి చలానా వేస్తారని తెలిసిందే. అయితే ఎప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించకుండా కూడా మీకు చలానా విధించినట్టు ఫోన్ మెసేజ్ వస్తే షాక్ అవ్వక తప్పదు. అంతేకాదు అది కట్టకపోతే మీరు ఊచలు లెక్కబెడతారంటూ హెచ్చరికలు కూడా వస్తుంటాయి. అంతేకాదు మీరు ఇప్పుడే కడితే చలానా లో 50 శాతం రాయితీ అంటూ చెబుతారు.

అయితే ఇది రవాణా శాఖ, పోలీసుల నుంచో వచ్చే అలర్ట్ కాదు. సైబర్ నేరగాళ్ల మాయ. ప్రజల డబ్బు కాజేసే ప్రయత్నం లో ఎలాంటి వాటికైనా సరే వెనుకడుగు వేయట్లేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఈ చలానా (e-Challan) రూపంలో ఘరానా మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలానా చెల్లించాలంటూ ఒక మెసేజ్ చేస్తారు. అది నిజమే అని వచ్చిన మెసేజ్ లోని లింక్ క్లిక్ చేస్తారు. అంతే వెంటనే వారి ఎకౌంట్ లో ఉన్న డబ్బు మాయం అవుతుంది.

హైదరాబాద్ (Hyderabad) సహా వివిధ ప్రాంతాల్లో ఈ ఘరానా మోసాలు జరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Crime Police) అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ ఈ చలానా అంటూ వచ్చిన లింక్ క్లిక్ చేస్తే చాలు వారి ఖాతా నుంచి డబ్బు ఖాళీ అవుతుంది. ఈ చలానా పేరుతో నకిలీ మెసేజ్ లు వస్తున్నాయని ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

అయితే వాహన దారుల డేటా సైబర్ నేరగాళ్ల దగ్గరకు ఎలా వెళ్తుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది. యజమానుల ఫోన్ నెంబర్లు వారికి ఎలా వెళ్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. కొన్ని ప్రైవేట్ సంస్థల్లో భద్రతా ఏర్పాట్లు తగిన విధంగా లేకపోవడం వల్లే ఇలా వాహనదారుల డేట్ బయట వారి దగ్గరకు వెళ్తున్నాయని తెలుస్తుంది.

ఈ చలానా మెసేజ్ రాగానే ఆ లింక్ క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. నకిలీ ఈ చలానా (Fake e-Challan) పేరుతో మెసేజ్ లను నమ్మి డబ్బు పోగొట్టుకుంటే అలాంటి వారు 1930 టోల్ ఫ్రీ నెంబర్, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన బైక్ లేదా కారు కి ఈ చలానా ఉన్నట్టు వస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ చలానా వెబ్ సైట్ లో వెరిఫై చేసుకోవాలి. అక్కడ ఉంటే మాత్రం అందులో అది కట్టి క్లియర్ చేసుకోవచ్చు.ఈ రకమైన అనుమానాస్పద ఫేక్ మెసేజ్ లు వస్తే వాట్సాప్ నెంబర్ 871672222 పంపి ఫిర్యాదు చేయచ్చని సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.

Also Read : Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లు తక్షణం అమలు కోసం సుప్రీంకోర్టులో పిల్‌