LIC Health Insurance : ఆరోగ్య బీమా సేవల్లోకి ప్రవేశిస్తామని ఎల్ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య బీమా సేవలందిస్తున్న కంపెనీలను ఎల్‌ఐసీలో విలీనం చేసుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన ఈవివరాలను వెల్లడించారు. ఆరోగ్య బీమా సేవలు అందించేందుకు ఎల్‌ఐసీకి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అంతర్గతంగా కసరత్తును మొదలుపెట్టామని మొహంతి చెప్పారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తాము 2,04,28,937 పాలసీలను విక్రయించామని ఎల్ఐసీ ఛైర్మన్ తెలిపారు. ఒక్కో ఎల్‌ఐసీ షేరుకు రూ.6 ఫైనల్ డివిడెెండ్‌గా చెల్లిస్తామన్నారు. గతేడాది కూడా ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్ ఇచ్చామన్నారు.
We’re now on WhatsApp. Click to Join
- బీమా(LIC Health Insurance) మూడు రకాలు. అవి.. జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా.
- ఒకే పాలసీతో సాధారణ బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాలను కవర్ చేయడానికి ప్రస్తుతం అనుమతి లేదు.
- ఈ మూడు రకాల బీమా సేవలను ఒకే బీమా కంపెనీ అందించేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు.
Also Read :KTR : ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- ఈ విధానంలో మార్పు చేసే దిశగా యోచించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
- జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాలను కలిపి మిశ్రమ బీమా పాలసీలను అందించేందుకు బీమా సంస్థలకు అనుమతించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
- ఈమేరకు బీమా చట్టంలో మార్పులు చేయాలని కమిటీ సూచించింది.
- కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.