APP : మంత్రి అతిషికి రౌస్‌ అవెన్యూ కోర్టు సమన్లు జారీ

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 04:09 PM IST

Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్‌ ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అతిషికి నోటీసులు ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బీజేపీ ఆప్‌ ఎమ్మెల్యేల(AAP MLAs)ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, డబ్బు ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానిస్తోందని గతంలో అతిషి ఆరోపించారు. దీంతో అతిషి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆమె వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ప్రవీణ్‌ పరువునష్టం దావా వేశారు.

Read Also: Shreyas Iyer: రోహిత్ త‌ర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా అయ్య‌ర్‌..?

ఇదే కేసులో ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌.. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal)ను కూడా ప్రతివాదిగా చేర్చారు. అయితే అతిషికి సమన్‌లు జారీచేసిన కోర్టు కేజ్రీవాల్‌ విషయంలో మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.