Delhi Capitals Shines: వార్నర్ దెబ్బకు…SRH కుదేల్..!!

IPL తాజా సీజన్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు.

  • Written By:
  • Updated On - May 8, 2022 / 07:17 PM IST

IPL తాజా సీజన్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 92 పరుగులు చేయగా…సెంచరీకి దరిదాపుల్లో  92 పరుగులు చేశాడు. మొత్తం 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను కోల్పోయిన ఢిల్లీ 207 పరుగులు చేసింది. 208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన SRH నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ ఓటమితో SRH పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి చేరుకుంది. నికోలస్ పూరన్ 34 బంతుల్లో 62 పరుగులు చేశాడు. సూపర్ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. మార్కర్రమ్ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠి వికెట్ తీశాడు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కేవలం 7 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చాడు.  దీంతో.. 8 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కేన్ మామ కూడా 4 పరుగులు చేసి అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్ లో పంత్ కి క్యాచ్ ఇచ్చాడు.

దీంతో.. 24 పరుగులకే  రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి కూడా నిరాశపరిచాడు. 22 పరుగులు చేసిన రాహుల్‌ త్రిపాఠి మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో.. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే.. కష్టాల్లో ఉన్న  SRHను ఆదుకున్నారు మార్కర్రమ్, నికోలస్ పూరన్. మొదట్లోనే నెమ్మదిగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత ప్రతాపం చూపించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 60 పరుగులు చేశారు. అయితే జోరుగా ఆడుతున్న ఈ జోడికి ఫుల్ స్టాప్ పెట్టాడు ఖలీల్ అహ్మద్. 25 బంతుల్లో 42 పరుగులు చేసిన మార్కర్రమ్.. కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో.. 97 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది హైదరాబాద్. మార్కర్రమ్ ఉన్నంతసేపు.. నెమ్మదిగా ఆడిన పూరన్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే..చివరిలో అతనికి ఎవరూ తోడులేరు. 10 పరుగులు చేసిన శశాంక్ సింగ్ శార్దూల్ బౌలింగ్ లో నోర్ట్జే కి క్యాచ్ ఇచ్చాడు.

వికెట్లు పడుతున్నా తన దూకుడును మాత్రం ఆపలేదు నికోలస్ పూరన్. ఈ క్రమంలో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయినా వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. 7 పరుగులు చేసిన అబాట్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో రిపల్ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో.. 153 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అయితే.. అర్ధ్ర సెంచరీ తర్వాత భారీ షాట్లకు ప్రయత్నించి నికోలస్ పూరన్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో టెయిలెండర్లు మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది.

ఇక  డేవిడ్ వార్నర్ దెబ్బకి సన్ రైజర్స్ బౌలర్లు తట్టుకోలేకపోయారు.  వార్నర్ కి పావెల్ తోడవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది.  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా… డేవిడ్ వార్నర్ 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. రోవెమన్ పావెల్ 67పరుగులు, రిషబ్ పంత్ 26పరుగులు, చేశారు.