Site icon HashtagU Telugu

44 Died : మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం

44 Died

44 Died

44 Died : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల మాల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం  సంభవించింది. ఈ ఘటనలో 44 మంది మరణించగా(44 Died), 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢాకాలోని రెస్టారెంట్లకు నెలవుగా ఉండే బెయిలీ రోడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు 13 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపింది.

We’re now on WhatsApp. Click to Join

గ్రీన్ కోజీ కాటేజ్ అనే పేరు కలిగిన ఆ భవనం నుంచి 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.  అత్యవసర చికిత్స నిమిత్తం వారందరినీ హుటాహుటిన ఢాకా మెడికల్ కాలేజీ, షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలలో చేర్చారు. ఆస్పత్రుల్లో చేర్పించే సమయానికే 33 మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స మొదలుపెట్టేలోగా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గురువారం రాత్రి 9:50 గంటలకు మొదటి అంతస్తులోని రెస్టారెంట్‌లో మంటలు ప్రారంభమై వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read : Kottha Bangarulokam : కొత్త బంగారు లోకం.. ఆ ఇద్దరు హీరోలు కాదన్నారా..?

కొందరి మృతదేహాలు ఎవరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు.  మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎగిసిపడుతున్న మంటల నుంచి తప్పించుకోడానికి జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు పెడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. ఈ ఘటనకు కారణం ఏమిటో తక్షణం తెలియరాలేదు. మాల్ మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణాలను రక్షించుకునేందుకు మహమ్మద్ అల్తాఫ్ అనే  ఉద్యోగి.. వంటగదిలోని కిటీకీ నుంచి దూకాడు. అయితే అతడు ప్రాణాలు కోల్పోయాడు.  ఆ వంటగదిలో ఉన్న మరో ఇద్దరు కాలి బూడిదయ్యారు.

Also Read :BCCI Central Contracts: ఇషాన్‌, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ