Site icon HashtagU Telugu

Helicopters Collide Video : సైనిక విన్యాసాలు.. రెండు హెలికాప్టర్లు ఢీ.. పదిమంది మృతి

Helicopters Collide

Helicopters Collide

Helicopters Collide Video : మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో పది మంది చనిపోయారు.  మలేషియా నౌకాదళ పరేడ్ కోసం  ప్రాక్టీస్ చేస్తుండగా ఈ రెండు హెలికాప్టర్లు  అదుపుతప్పి ఢీకొన్నాయి.  దీంతో వాటిలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారాన్ని  రాయల్ మలేషియా నేవీ మంగళవారం ఉదయం ధ్రువీకరించింది.

We’re now on WhatsApp. Click to Join

లుముట్ నౌకాదళ స్థావరంలో..

పశ్చిమ మలేషియాలోని పెరాక్‌లో ఉన్న లుముట్ నౌకాదళ స్థావరం వద్ద మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:32 గంటలకు ఈ ఘటన జరిగిందని వెల్లడించింది.  రెండు హెలికాప్టర్లు ఢీకొని కూలిపోయాయని(Helicopters Collide).. పది మంది కూడా అక్కడికక్కడే చనిపోయారని తెలిపింది. డెడ్ బాడీస్ బాగా కాలిపోవడంతో వారిని గుర్తించేందుకు సమీపంలోని లుముట్ ఆర్మీ బేస్ ఆస్పత్రికి  తరలించారు.

Also Read : MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. బెయిల్ వస్తుందా ?

పిట్టల్లా రాలిపోయాయి.. 

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మలేషియాలోని లుముట్ ప్రాంతంలో నౌకాదళ స్థావరం ఉంది. ఇక్కడ ఆర్మీ హెలికాప్టర్లతో ఎంతో ఉత్సాహంగా సైనిక విన్యాసాలను మొదలుపెట్టారు.  ఒక్కసారిగా గాల్లోకి హెలికాప్టర్లు రివ్వుమని ఎగిరాయి. అవన్నీ దేనికి అదిగా గాల్లోకి దూసుకెళ్లాయి. కానీ రెండు హెలికాప్టర్లు మాత్రం ఎందుకో తెలియదు.. చాలా దగ్గరదగ్గరగా.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా గాల్లో జర్నీ చేయడం మొదలుపెట్టాయి. ముందొక హెలికాప్టర్, దాని వెనుకే మరో హెలికాప్టర్ !! వెనుక వైపు ఉన్న హెలికాప్టర్ ఒక్కసారిగా టర్నింగ్ తీసుకోబోయింది. ఈక్రమంలో ముందున్న హెలికాప్టర్ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయింది.  దీంతో వెనుక ఉన్న హెలికాప్టర్‌ను .. ముందుగా వెళ్తున్న హెలికాప్టర్ తోక భాగం తాకింది. ఆ వెంటనే రెండు హెలికాప్టర్లపై పైలట్లు అదుపు కోల్పోయారు. క్షణాల వ్యవధిలోనే రెండు హెలికాప్టర్లు కూడా పిట్టల్లా నేలపై రాలిపోయాయి. ఈ ఘటనలో ఆ హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న 10 మంది కూడా ప్రాణాలు కోల్పోవడంతో సైనిక విన్యాసాలను ఆపేశారు. సహాయక చర్యలను మొదలుపెట్టారు.

Also Read : Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్