World Chocolate Day : హ్యాపీ చాక్లెట్ డే.. దీని హిస్టరీ వెరీ ఇంట్రెస్టింగ్

World Chocolate Day  : చాక్లెట్ అంటే ఎవరికి మాత్రం చేదు !! అది అంతా తీపే కదా !!  ఈరోజు (జూలై 7) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. 

  • Written By:
  • Updated On - July 7, 2023 / 09:24 AM IST

World Chocolate Day  : చాక్లెట్ అంటే ఎవరికి మాత్రం చేదు !! అది అంతా తీపే కదా !!  

ఏ సంతోషకర సందర్భమైనా చాక్లెట్ లేకుండా కంప్లీట్ కాదు.. 

ప్రత్యేకించి పిల్లలకు చాక్లెట్ అంటే మహా ఇష్టం.. 

పిల్లలకు రోజూ స్కూల్ కు వెళ్లడం  ఎలా అలవాటో.. రోజూ చాక్లెట్స్ తినడం కూడా అంతే అలవాటు !!

ఈరోజు (జూలై 7) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. 

చాక్లెట్ కు చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే మనం 14వ శతాబ్దానికి వెళ్ళాలి. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు మెక్సికో దేశాన్ని అజ్టెక్ వంశ రాజులు పాలించారు. 1519లో స్పానిష్ నావికుడు హెర్నాన్ కోర్టెస్‌ తమ రాజ్యానికి వచ్చినప్పుడు.. అతడికి అజ్టెక్ చక్రవర్తి Xocolatl అనే తీపి పానీయాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ పానీయాన్ని కోర్టెస్ యూరప్‌కు తీసుకెళ్ళి అక్కడున్న రాజ వంశాలకు పరిచయం చేశాడు. Xocolatl అనే పానీయాన్నియూరప్ దేశాల ప్రజలు చాక్లెట్  (Chocolate) అని పిలవడం ప్రారంభించారు. ఆ విధంగా “Chocolate” అనేది మెక్సికో సరిహద్దులు దాటి యూరప్ ప్రజలకు జూలై 7న పరిచయమైందని అంటారు. అందుకే ఈ తేదీన ప్రపంచ చాక్లెట్ దినోత్సవం(World Chocolate Day) జరుపుకుంటారు. యూరప్ దేశాలు .. 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఆసియా, ఆఫ్రికా దేశాలపై దండయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలకు చాక్లెట్ పానీయాన్ని పరిచయం చేశాయి. అయితే మెక్సికో నుంచి తెచ్చిన చాక్లెట్ పానీయంలో యూరప్ ప్రజలు చక్కెర, వెనీలా, దాల్చిన చెక్కను కలిపి దాని టేస్ట్ ను మార్చడం గమనార్హం. 18వ శతాబ్దానికి ముందు వరకు ద్రవ రూప చాక్లెట్ పానీయాలే అందుబాటులో ఉండేవి.  18వ శతాబ్దం తర్వాత ఘన రూప చాక్లెట్లు ప్రజలకు పరిచయం అయ్యాయి.

Also read : Hemp Seeds: జనపనార విత్తనాలు గురించి విన్నారా..!? జనపనార విత్తనాలు తీసుకుంటే ఏంటి లాభం..?

డార్క్ చాక్లెట్ల డార్క్ సైడ్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఇటీవల డార్క్ చాక్లెట్‌ల గురించి సంచలన ట్వీట్ చేశారు. కొన్ని డార్క్ చాక్లెట్ బార్‌లలో క్యాడ్మియం, లెడ్‌లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇవి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయని హెచ్చరించారు. ప్రత్యేకించి గర్భిణులు, చిన్న పిల్లలకు డార్క్ చాక్లెట్ బార్‌ లు సురక్షితం కాదని స్పష్టం చేశారు. కొన్ని డార్క్ చాక్లెట్ బార్‌లలోని క్యాడ్మియం, లెడ్‌ల వల్ల హైబీపీ, కిడ్నీలు దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యలు ముసురుకునే ముప్పు ఉంటుందని తెలిపారు. ఇవి మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని, ఫలితంగా మెదడు IQ లెవల్స్ తగ్గుతాయని చెప్పారు. ఇక లెడ్ వల్ల పెద్దవారిలో  నాడీ వ్యవస్థ సమస్యలు, రక్తపోటు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. సీసం, కాడ్మియం, కోకో తక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్లను తీసుకోవాలని సూచించారు.