Helicopter Crashes : హెలికాప్టర్లు ఎందుకు కూలుతాయి ? కారణాలు ఏమిటి ?

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోవడం అంతటా కలకలం క్రియేట్ చేసింది.

  • Written By:
  • Updated On - May 23, 2024 / 09:46 AM IST

Helicopter Crashes : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోవడం అంతటా కలకలం క్రియేట్ చేసింది. హెలికాప్టర్ల భద్రతపై ప్రశ్నలను రేకెత్తించింది. ఇంతకీ హెలికాప్టర్ల ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ? కారణాలు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

విమానాల కంటే హెలికాప్టర్లకే ఎక్కువ రిస్క్

హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగించడానికి కారణం.. వాటికి ఉన్న ప్రత్యేక సామర్థ్యాలే. వీటి ల్యాండింగ్, టేకాఫ్‌కు రన్‌వేలు అక్కర్లేదు. తక్కువ ఎత్తులోనూ హెలికాప్టర్లు ఎగరగలవు. ఈ బలాలే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో బలహీనతలుగా మారే అవకాశం ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే హెలికాప్టర్లలో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ.. ప్రమాదం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లు కూలిపోయే ముప్పు 35 శాతం ఎక్కువ. ప్రతి లక్ష గంటల జర్నీకి హెలికాప్టర్లు  కుప్పకూలే రేటు 9.84గా ఉంది. విమానాల విషయంలో అది కేవలం 7.26గా ఉంది. అందుకే విమానాలతో పోలిస్తే హెలికాప్టర్‌ పైలట్లకు ఎక్కువ నైపుణ్యం, అప్రమత్తత అవసరం. కొన్నిసార్లు పైలట్లు ప్రతికూల ప్రదేశాల్లో హెలికాప్టర్లను దించేందుకు సాహసిస్తుంటారు. ఈ క్రమంలో చుట్టుపక్కల అవరోధాలను పైలట్లు విస్మరించడం ప్రమాదాలకు దారి తీస్తుంటుంది.

Also Read :Lankapalli Vasu : లంకపల్లి వాసు.. రేవ్ పార్టీ నిందితుడి చీకటి చిట్టా వెలుగులోకి

హెలికాప్టర్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవీ.. 

  • కొన్నిసార్లు హెలికాప్టర్ నిర్వహణ సిబ్బంది వల్ల కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. రిపేరింగ్ క్రమంలో హెలికాప్టర్‌లోని  కొన్ని భాగాలను గట్టిగా బిగించకపోయినా కొన్ని సార్లు ప్రమాదాలు జరిగే రిస్క్ ఉంటుంది. అందుకే రిపేర్లు జరిగిన అనంతరం హెలికాప్టర్‌ను పైలట్లు తనిఖీ చేస్తుంటారు.
  • హెలికాప్టర్‌‌లోని మెయిన్‌ రోటర్‌ (ప్రధాన రెక్కలు), టెయిల్‌ రోటర్‌ (తోక రెక్కలు), రోటర్‌ షాఫ్ట్, ప్రధాన గేర్‌ బాక్స్, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి వాటిలో ఏ ఒక్కటి ఫెయిలైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది.
  • హెలికాప్టర్‌ పైభాగంలో ఉండే ప్రధాన రెక్కలు (రోటర్‌) దెబ్బతినడం కానీ.. వాటి భ్రమణంపై పైలట్‌ నియంత్రణ కోల్పోయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
  • హెలికాప్టర్‌ తక్కువ ఎత్తులో ఎగిరేటప్పుడు చెట్లు, కొండలు, పక్షులు వంటివి  రెక్కలకు తగలొచ్చు.
  • హెలికాప్టర్‌ను స్థిరంగా ఉంచడంలో తోక రెక్కలే చాలా కీలకం. అవి పని చేయకుంటే ప్రధాన రెక్కలు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో హెలికాప్టర్‌ బాడీ తిరుగుతుంది.
  • హెలికాప్టర్‌లో కొన్నిసార్లు గేర్‌బాక్స్‌ ఫెయిల్ అవుతుంటుంది. ఈ భాగంపై చాలా ఒత్తిడి ఉంటుంది. అందువల్ల పగుళ్లు ఏర్పడి ఫెయిలయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
  • ఇంజిన్‌ ఫెయిల్యూర్ వల్ల కూడా హెలికాప్టర్లు కూలిపోతుంటాయి. ఒకే ఇంజిన్‌ ఉన్న హెలికాప్టర్‌లో ఈ పరిస్థితి ఎదురైతే.. పైలట్లు ‘ఆటోరొటేషన్‌’లో పెడతారు. అనంతరం మెల్లగా ల్యాండింగ్‌ చేస్తారు. అయితే ఇది చాలా టఫ్ విషయం. రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్‌లో ఒక ఇంజిన్ ఫెయిలైతే పరిస్థితిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ.
  • హెలికాప్టర్‌కు గ్లైడింగ్‌ సామర్థ్యం ఉండదు. ఇంజిన్‌ ఫెయిలైతే సురక్షిత ల్యాండింగ్‌ ప్రదేశం కోసం అది ఎక్కువ దూరం ప్రయాణించలేదు.
  •  ప్రయాణం జరుగుతున్న టైంలో ఇంజిన్‌కు ఇంధనం సప్లై సరిగ్గా జరగకున్నా హెలికాప్టర్ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ.
  • అత్యవసర సేవలు, మంటలు ఆర్పే కార్యకలాపాలు, సైనిక చర్యల్లో పాల్గొనే హెలికాప్టర్లకు(Helicopter Crashes) రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

Also Read : Lok Sabha Elections : పురుషులు 8,360 మంది.. మహిళలు 797 మంది.. లోక్‌సభ సీట్ల కేటాయింపులో వివక్ష