Navratri Special: ఈసారి నవరాత్రులు ప్రత్యేకం.. 110 ఏళ్ల తర్వాత 4 గ్రహాల మహా సంయోగ సందర్భం

నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గా మాత యొక్క 9 విభిన్న రూపాలను భక్తులు పూజిస్తారు. ఈసారి చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగుస్తాయి.

నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గా మాత యొక్క 9 విభిన్న రూపాలను భక్తులు పూజిస్తారు. ఈసారి చైత్ర నవరాత్రులు (Chaitra Navratri) మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగుస్తాయి. దీంతోపాటు చైత్ర నవరాత్రుల సందర్భంగా 110 ఏళ్ల తర్వాత 4 గ్రహాల అరుదైన మహా సంయోగం జరగబోతోంది. దీంతోపాటు దుర్గా మాత ఈసారి పడవపై స్వారీ చేస్తూ రాబోతోంది. ఇది చాలా శుభప్రదమని నమ్ముతారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఒక సంవత్సరంలో నాలుగు నవరాత్రులు (Navratri) జరుపుకుంటారు. శక్తి నవరాత్రుల ఆరాధన యొక్క గొప్ప పండుగ చైత్ర శుక్ల ప్రతిపద నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఉగాది కూడా షురూ అవుతుంది. ఈసారి నవరాత్రులలో నాలుగు యోగాల ప్రత్యేక కలయిక జరుగుతోంది.

చైత్ర నవరాత్రి (Chaitra Navratri) శుభ ముహూర్తం:

మార్చి 21వ తేదీ రాత్రి 11:04 గంటలకు ప్రత్తిపాద తిథి జరుగుతుంది. అందుకే మార్చి 22న సూర్యోదయంతో కలశ స్థాపనతో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.  ఈ సంవత్సరం అమ్మవారి రాక పడవపై ఉంది. దీనిని ఆనందం, శ్రేయస్సుల కారకంగా పిలుస్తారు.  నవరాత్రులలో అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు.  ఈసారి నవరాత్రులలో నాలుగు గ్రహాల పరివర్తన కనిపిస్తుంది. 110 ఏళ్ల తర్వాత ఈ మహా సంయోగం జరగనుండటం విశేషం.  ఈసారి ఉగాది రోజున బ్రహ్మ దేవుడు భూమిని సృష్టించాడని నమ్ముతారు. అందువల్ల ఇది మరింత ముఖ్యమైనదిగా మారుతుంది. ఈ సంవత్సరం రాజు బుధుడు, మంత్రి శుక్రుడు. దీని వల్ల విద్యారంగంలో విప్లవానికి అనేక అవకాశాలు ఉంటాయి మరియు ఈ సంవత్సరం మహిళల ప్రత్యేక అభ్యున్నతి కూడా కనిపిస్తుంది.

చైత్ర నవరాత్రి (Chaitra Navratri) పూజా విధానం:

కలశ స్థాపన పద్ధతిని ప్రారంభించే ముందు.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ప్రతిష్టించండి. ఈ గుడ్డ మీద కొంచెం బియ్యం వేయండి. ఒక మట్టి పాత్రలో బార్లీని విత్తండి. ఈ పాత్రలో నీటితో నిండిన ఒక కలశాన్ని అమర్చండి. ఈ కలశంపై స్వస్తిక్ తయారు చేసి, దానిపై కలావా కట్టాలి.

పోకలు, నాణెం, అక్షతలతో కూడిన తమలపాకులను కలశంలో ఉంచండి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానిపై చున్రిని చుట్టి, దాన్ని కలావాతో కట్టాలి. ఈ కొబ్బరికాయను కలశంపై ఉంచి దుర్గాదేవిని ఆవాహన చేయండి. ఆ తర్వాత కలశానికి దీపం వెలిగించి పూజించాలి. నవరాత్రులలో అమ్మవారి పూజ కోసం బంగారం, వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి కలశం ఏర్పాటు చేస్తారు.

ఏయే రోజు.. ఏయే రూపాల్లో అమ్మవారు

    1. మొదటి రోజు 22 మార్చి : శైలపుత్రి అమ్మవారి పూజ (ఘటస్థాపన)
    2. రెండో రోజు 23 మార్చి : మాతా బ్రహ్మచారిణి పూజ
    3. మూడో రోజు 24 మార్చి : మాతా చంద్రఘంట పూజ
    4. నాలుగో రోజు 25 మార్చి: మాతా కూష్మాండ పూజ
    5. ఐదో రోజు 26 మార్చి : మాతా స్కందమాత పూజ
    6. ఆరో రోజు 27 మార్చి : మాతా కాత్యాయని పూజ
    7. ఏడో రోజు 28 మార్చి : మాతా కాళరాత్రి పూజ
    8. ఎనిమిదో రోజు 29 మార్చి : మాతా మహాగౌరి పూజ
    9. తొమ్మిదో రోజు 30 మార్చి : మాతా సిద్ధిదాత్రి పూజ

Also Read:  Tiruchendur Vibhuti: తిరుచెందూర్ విభూతి మహిమ తెలుసా మీకు!