Sun And Planets: భూమిని సూర్యుడు మింగేస్తాడా? ఎప్పుడు.. ఎలా ?

సాధారణంగా నక్షత్రాలు చనిపోతుంటాయి. సూర్యుడు కూడా అలాగే ఒక రోజు కాలం చాలిస్తాడా?

  • Written By:
  • Publish Date - August 23, 2022 / 06:15 AM IST

సాధారణంగా నక్షత్రాలు చనిపోతుంటాయి. సూర్యుడు కూడా అలాగే ఒక రోజు కాలం చాలిస్తాడా? అంటే ఇటీవల
యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన గియా స్పేస్‌‌క్రాఫ్ట్ అందజేసిన డేటాను బట్టి “ఔను” అనే సమాధానమే లభించింది. అయితే 1011 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడి ఆయువు నిండే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..ఒక రోజు సూర్యుడిలో భారీ విస్ఫోటనం జరుగుతుందట. ఎంతలా అంటే.. అత్యంత సమీపంలో ఉన్న బుధ గ్రహం, శుక్ర గ్రహం, భూమిని సూర్యుడు మింగిసేంత భారీగా!! ఈ విస్ఫోటనం దెబ్బకు సూరీడి దరిదాపుల్లో ఉండే గ్రహాల నామరూపాలు కూడా మిగలవని అంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఈవిషయాన్ని ఒక సిమ్యులేషన్ అధ్యయనంలో గుర్తించారు. సూర్యుడు ఒక చాపలా మారి దగ్గరున్న గ్రహాలను తనలో చుట్టేసుకుంటాడని అధ్యయన నివేదిక పేర్కొంది. సమీపంలోని గ్రహాలను తనలో కలిపేసుకున్న తర్వాత.. సూర్యుడి పరిమాణం మరింత పెరుగుతుందని సైంటిస్టులు విశ్లేషించారు. ఇతర గ్రహాలు సూర్యుడిలో మమేకం అయిన తర్వాత చోటుచేసుకునే భౌతిక, రసాయనిక చర్యల ఆధారంగా సూర్యుడి భావి పరిణామం ఎలా ఉంటుంది అనేది నిర్ణయమవుతుంది.ఉన్నట్టుండి సూర్యుడు అదృశ్యం అయితే గ్రహాలు ఏమౌతాయి? వాటి పరిస్థితి..మనుగడ ఎలా ఉంటుందనే విషయం మన ఆలోచనకు కూడా రాదు.

కేంద్రక సంలీనం ద్వారా..

కేంద్రక సంలీనం ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ అణువులను హీలియం అణువులుగా మారుస్తూ సూర్యుడు క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోతాడని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా చివరి దశలో మృత నక్షత్రంగా మారుతాడన్నది ఒక అంచనా. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్లు ఏండ్లు.
సౌరకుటుంబానికి కేంద్ర బిందువు.. సూర్యుడు. దీన్ని ఆధారంగా చేసుకుని గెలాక్సీ నడుస్తోంది. భూమి సహా సౌర వ్యవస్థలోని గ్రహాలు మనుగడ సాగించడానికి రెడ్ ప్లానెట్ కారణం. అలాంటి సూర్యుడు లేని అంతరిక్షం ఎలా ఉంటుందనేది కనీసం ఊహకు కూడా అందదు.

హైడ్రోజన్, హీలియం తరిగిపోయి..

హైడ్రోజన్, హీలియం మిశ్రమాలతో సూర్యుడు ఏర్పడ్డాడు. ఇదొక సాధారణ నక్షత్రం లాంటిదే. అందులో నుంచి నిరంతరం హైడ్రోజన్, హీలియం వాయువులు వెలువడుతుంటాయి. అంటే సూర్యుడు తనకు తానుగా మనుగడ సాగించడానికి హైడ్రోజన్ ఆధారం. ఇప్పుడా హైడ్రోజన్ క్రమంగా తరిగిపోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు. సూర్యుడి నుంచి వెలువడే హైడ్రోజన్ క్రమంగా తగ్గిపోతోందని, కొన్ని సంవత్సరాల తరువాత ఇది పూర్తిగా అడుగంటిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా సూర్యుడు ఓ మృత నక్షత్రంగా మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.