Pearl Chihuahua; ప్రపంచంలోనే పొట్టి కుక్క ఇది!

ఈ భూప్రపంచం వింతలు, విశేషాలకు నిలయం. ప్రపంచంలో కొన్ని వింతలు నమ్మశక్యం కానీ విధంగా ఉంటాయి. కళ్లారా చూస్తేనే తప్ప నమ్మలేం

Pearl Chihuahua; ఈ భూప్రపంచం వింతలు, విశేషాలకు నిలయం. ప్రపంచంలో కొన్ని వింతలు నమ్మశక్యం కానీ విధంగా ఉంటాయి. కళ్లారా చూస్తేనే తప్ప నమ్మలేం. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లనే ఆశ్చర్యపరిచిన ఓ జీవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ జీవిని హ్యాండ్ బ్యాగ్ లో ఇమిడే అంత చిన్నదిగా ఉండటంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.

అమెరికా ఫ్లోరిడా ( Florida )లోని ఓ శునకం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. రెండు సంవత్సరాల వయసున్న చివావా జాతికి చెందిన పెర్ల్ అనే శునకం ప్రపంచంలోనే అత్యంత చిన్న జీవిగా గిన్నిస్ వారు గుర్తించారు. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించి రికార్డుల్లోకి ఎక్కించారు. పెర్ల్ ఎత్తు 9.14 cm (3.59 in), పొడవు 12.7 cm (5.0 in) దీని పరిమాణం డాలర్ నోటుకు సమానం. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నమ్మలేని నిజం.

ఈ వింత శునకానికి యజమాని వెనెస్సా సెమల్. ఎంతో ఇష్టంగా పెంచుకునే తన శునకం ఈ ఫీట్ సాధించడంతో చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. దీంతో తన శునకాన్ని చూసి మురిసిపోతున్నారు. నిజానికి పెర్ల్ స్వభావం ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా చివావా జాతి కుక్కలు ఎప్పుడూ ఉల్లాసంగా కనిపిస్తాయి.

Read More: Viral Pic: హనుమాన్‌ జయంతిలో అద్భుత దృశ్యం.. చక్కర్లు కొడుతున్న ఫొటో