Telangana State Bird – Dussehra : పాలపిట్ట ఎందుకు శుభప్రదం ? అది అంతరిస్తోందా ?

Telangana State Bird - Dussehra : దసరా వేళ పాలపిట్టను చూడటాన్ని శుభప్రదంగా భావిస్తారు.

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 11:26 AM IST

Telangana State Bird – Dussehra : దసరా వేళ పాలపిట్టను చూడటాన్ని శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల టైంలో పాలపిట్ట కనిపిస్తే, సంవత్సరం పొడవునా విజయాలు దక్కుతాయని నమ్ముతారు. దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడం మన ప్రాచీన సంప్రదాయం. దీన్ని ఇంగ్లిష్ లో ‘ఇండియన్ రోలర్’ అని పిలుస్తారు. పాలపిట్ట.. తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, బీహార్‌లలోనూ రాష్ట్ర పక్షి. ఇంతకీ దసరా వేళ పాలపిట్ట సందర్శన ఎందుకు ముఖ్యం ? ప్రస్తుతం దసరా వేళ పాలపిట్ట మనకు ఎందుకు కానరావడం లేదు ? ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల్లో పాలపిట్ట.. 

  • పాలపిట్ట‌ను ప‌ర‌మేశ్వ‌రుడి స్వ‌రూపంగా భావిస్తుంటారు. దాన్ని మ‌న‌శ్శాంతికి, ప్ర‌శాంత‌త‌కు, కార్య‌సిద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఈ నమ్మకం వెనుక పలు పురాణ‌గాథ‌లు ఉన్నాయి.
  • రావ‌ణాసురుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బ‌య‌లుదేరిన‌ టైంలో ఆయనకు పాలపిట్ట‌ ఎదురుపడి క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన వార్ లో రాముడు విజ‌యం సాధిస్తారు. అందుకే పాలపిట్ట‌ను శుభ‌శ‌కునంగా విశ్వసిస్తారు.
  • అజ్ఞాత వాసానికి ముందు పాండ‌వులు జ‌మ్మిచెట్టుపైన దాచిన ఆయుధాల‌ను పాల‌పిట్ట రూపంలో వెళ్లి ఇంద్రుడు కాపలా కాశాడని అంటారు. పాండ‌వులు అజ్ఞాతవాసం ముగించుకుని వస్తుండగా దారిలో వారికి పాలపిట్ట‌ కనిపించింది. అప్ప‌టినుంచి వారి క‌ష్టాలు తొల‌గిపోయాయి. కురుక్షేత్ర యుద్ధంలో గెలవడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు.
  • పాల పిట్ట ఉత్త‌ర దిక్కు నుంచి ఎదురైతే ఇంకా మంచిద‌ని చెబుతారు. ద‌క్షిణం దిక్కు నుంచి పాలపిట్ట వ‌స్తే అశుభానికి సంకేత‌మ‌నే వాదన (Telangana State Bird – Dussehra) ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

పాలపిట్టలు ఎందుకు అంతరిస్తున్నాయి ?

  • ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరావడం లేదు. అంతరించిపోయే పక్షుల జాబితాలో పాలపిట్ట చేరే పరిస్థితి వచ్చేసింది.
  • స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్టు ప్రకారం.. 2022తో పోలిస్తే 2023లో మన దేశంలో పాలపిట్టల సంఖ్య 30 శాతం దాకా తగ్గింది.డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గిపోతోందనే వాదన ఉంది.
  • ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో 300కి పైగా పాలపిట్టలు ఉండేవనీ, ఇప్పుడు వాటి సంఖ్య 200కు తగ్గిపోయిందని నిపుణులు అంటున్నారు.
  • పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి కాబట్టి.. దీన్ని పట్టుకోవడం, బంధించడం నేరం. దీనికి నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుంది. మూడేళ్ల జైలుశిక్ష లేదా రూ.25వేల ఫైన్ వేస్తారు. అందువల్ల ఎవరైనా సరే, పాలపిట్ట కనిపిస్తే చూసి ఆనందించాలే తప్ప.. దాని జోలికి వెళ్లవద్దు.
  • పంటలను ఆశించే క్రిమికీటకాలను తింటూ పాలపిట్టలు బతుకుతాయి.
  • మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది.
  • పంటలపై చల్లే పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం డౌన్ అయింది. ఒక సీజన్‌లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండు గుడ్లు పెట్టే స్థాయికి పాలపిట్టలు పరిమితమయ్యాయి.