Condom Day 2024 : రేపు వాలెంటైన్స్ డే.. ఇవాళే కండోమ్స్ డే.. ఎందుకలా ?

Condom Day 2024 : రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికుల దినోత్సవం.. ఇవాళ ఏ దినోత్సవమో తెలుసా ? 

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 03:02 PM IST

Condom Day 2024 : రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికుల దినోత్సవం.. ఇవాళ ఏ దినోత్సవమో తెలుసా ?  కండోమ్ డే ఈరోజే.   కుటుంబ నియంత్రణ, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నిరోధించే సాధనం కండోమ్. అందుకే దీని ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇవాళ (ఫిబ్రవరి 13న) అంతర్జాతీయ కండోమ్స్ డే నిర్వహిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

‘కండోమ్’ గురించి ప్రస్తావించడమే పెద్ద తప్పు అనేలా మన దేశంలో చాలామంది ఫీలై పోతుంటారు. అయితే అలా ఆలోచించడం కచ్చితంగా పొరపాటే. ఎందుకంటే కండోమ్‌ను  కుటుంబ నియంత్రణ సాధనంగా, లైంగికంగా ఇన్​ఫెక్షన్లు సంక్రమించకుండా నిరోధించే సాధనంగా మనం వాడుతుంటాం. కండోమ్స్ వాడకం వల్ల లైంగిక ఇన్ఫెక్షన్ల సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని చాలా అధ్యయన నివేదికలు తెలిపాయి.

మనదేశంలో పదేళ్లలో 17 లక్షల మందికి హెచ్​ఐవీ

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. కండోమ్ లేకుండా అసురక్షిత లైంగిక సంపర్కం చేయడం ద్వారా గత పదేళ్లలో మనదేశంలోదాదాపు 17 లక్షల మందికి హెచ్​ఐవీ సోకింది. కండోమ్ వాడి ఉంటే ఇంతమందికి ప్రమాదకర హెచ్ఐవీ వ్యాధి సోకి ఉండేదే కాదు. ఇప్పటిదాకా  హెచ్​ఐవీకి పూర్తి చికిత్స లేదు. ఇది రాకుండా ముందుజాగ్రత్త పడటం ఒక్కటే మన ముందున్న ఏకైక మార్గం. హెచ్‌ఐవీ వైరస్ కలిగిన రక్తం, వీర్యం, యోని స్రావాలతో ఇతరులకు హెచ్‌ఐవీ సోకుతుంది. అందుకే ఎయిడ్స్ రోగులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారికి చికిత్స అందించే క్రమంలో ఇతరులు కూడా అలర్ట్‌గా ఉండాలి. అలా అని భయపడాల్సిన పనిలేదు.

Also Read : CM Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి ‘కాళేశ్వరం’ బలి.. ఆ వీడియో పోస్ట్ చేసిన రేవంత్

వాలెంటైన్స్ డే.. కండోమ్ డే.. లక్ష్యం ఇదే

వాలెంటైన్స్ డేకు సరిగ్గా ఒకరోజు ముందు (ఫిబ్రవరి 13న) అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం(Condom Day 2024) నిర్వహించడం వెనుక గొప్ప పరమార్ధమే ఉంది. ప్రేమికులు ఒకవేళ సెక్స్‌లో పాల్గొన్నా.. కండోమ్స్ వినియోగం లాంటి సురక్షితమైన సెక్స్ పద్ధతులను అనుసరించేలా  ప్రోత్సహించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉంది. లైంగిక ఆరోగ్య విద్య, కండోమ్​ల ప్రాముఖ్యతపై అవగాహనను పెంచడం అనేది కండోమ్ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. కండోమ్​ల వినియోగం చుట్టూ ఉన్న కళంకాన్ని తగ్గించాలనే లక్ష్యం కూడా ఇందులో ఉంది.  1990వ దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా కండోమ్స్ వినియోగం బాగా పెరిగింది. 11.7 కోట్ల మందిలో కొత్తగా హెచ్ఐవీ ఇన్​ఫెక్షన్లు సోకకుండా కండోమ్స్ అడ్డుకట్ట వేశాయి. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల వయసు కలిగినన  37 కోట్ల మందికి కొత్తగా లైంగికపరమైన ఇన్​ఫెక్షన్లు సోకినట్లు గుర్తించారు. ఇలా ఉపద్రవాలు ఇంకా కొనసాగకూడదు అంటే తప్పకుండా కండోమ్స్ వినియోగాన్ని పెంచేలా ప్రజలను ప్రోత్సహించాల్సి అవసరం ఉంది.

Also Read : Expensive Electric Cars : దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల విశేషాలివీ..