Explained : ప్రవాస భారతీయులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదిలేస్తున్నారు ? లోగుట్టు ఇదీ!!

గత మూడేళ్లలో 3.9 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 11:00 AM IST

గత మూడేళ్లలో 3.9 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఒక్క 2021 సంవత్సరంలోనే 1.63 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశాల పౌరసత్వం పుచ్చుకున్నారు.వాళ్లంతా ఏయే దేశాల పౌరసత్వం తీసుకుంటున్నారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం ఏటా కోట్లాది మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. దాదాపు 103 దేశాల్లో భారత ప్రవాసులు ఉంటారు. ఎక్కువ మంది భారతీయులు వెళ్లే విదేశాల జాబితాలో అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, జర్మనీ, స్వీడన్ ఉన్నాయి. గత మూడేళ్ళలో ఎక్కువ మంది భారతీయులు పౌరసత్వాన్ని పొందిన దేశాలు కూడా ఇవే. ఇందుకోసం ప్రవాస భారతీయులు మన దేశ పౌరసత్వాన్ని సైతం వదిలేశారు.

ఏ దేశం .. ఎంతమంది ప్రవాసులకు పౌరసత్వం ?

* 2021లోనే 78,000 మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.
* 64,071 మంది కెనడాలో పౌరసత్వం తీసుకున్నారు.
* 58,391 మంది ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
* 35,435 మంది UK పౌరసత్వాన్ని తీసుకున్నారు.
* భారతీయులు ఇటలీ (12,131), న్యూజిలాండ్ (8,882), సింగపూర్ (7,046), జర్మనీ (6,690), స్వీడన్ (3,754), పాకిస్తాన్ (48)లో కూడా పౌరసత్వం పొందారు.

ఇండియా సిటిజెన్ షిప్ వదిలేయడానికి కారణాలు?

* భారతదేశం తన పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉండే అవకాశాన్ని ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగ, వ్యాపార ప్రయోజనాలు ఎక్కువగా ఉండే దేశపు పౌరసత్వాన్ని పొందేందుకు ప్రవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

*విదేశీ పౌరసత్వం కోరుకునే వాళ్ళు తప్ప కుండా భారత  పౌరసత్వం వదులుకోవాల్సిందే. అయితే ఈక్రమంలోనే  భారత ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఇచ్చింది.
ఈ గుర్తింపు ప్రకారం భారత్ లో ఎక్కడైనా సరే ఏ రంగంలో నైనా సరే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి.కానీ ఈ విషయంపై అతి తక్కువ మంది దృష్టి పెడుతున్నారట.
* ఇంటర్నేషన్స్ ద్వారా 2021 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ సర్వే ప్రకారం.. ప్రవాస భారతీయుల్లో 59 శాతం మంది ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడినట్లు వెల్లడించారు.

* భారతీయ అమెరికన్ కుటుంబానికి మధ్యస్థ ఆదాయం దాదాపు $123,700. ఇది భారత దేశవ్యాప్త సగటు ఆదాయం $63,922 కంటే దాదాపు రెట్టింపు.
* విద్య విషయానికొస్తే భారత
జాతీయ సగటు 34 శాతంతో పోలిస్తే USలోని భారతీయ సమాజంలో 79 శాతం మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
* సింగపూర్, పోర్చుగల్ వంటి
అనేక దేశాలు అందించే ‘గోల్డెన్ వీసా’ ప్రోగ్రామ్ కూడా ప్రవాస భారతీయులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా దేశాలు గోల్డెన్ వీసా ఇచ్చి ధనవంతులైన విదేశీ వ్యక్తులను.. తమ పౌరులుగా మార్చుకుంటాయి.
* ఐరోపా దేశాలైన మాల్టా, గ్రీస్, పోర్చుగల్ ఇచ్చే గోల్డెన్ వీసాలపై భారతీయ హెచ్ఎన్‌ఐలు(అపర కుబేరులు) ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది దేశాలే ఇటువంటి వీసాను ఇస్తున్నాయి.

* భారత్ పాస్‌పోర్ట్ స్కోర్ తక్కువే.
60 దేశాలకు మాత్రమే వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ ఉంది. మచ్చుకు పరిశీలిస్తే.. పోర్చుగల్‌లో పౌరసత్వం పొందిన భారతీయుడు ఉంటే.. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను ఉపయోగించడం ద్వారా, 187 దేశాలకు వీసా-ఫ్రీ/వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ని అందించే పాస్‌పోర్ట్ పొందుతాడు.

*అమెరికా లాంటి పాస్ పోర్టుతో 100కుపైగా విదేశీ గమ్యస్థానాలకు వీసా అవసరం లేకుండానే చేరుకోవచ్చు. అక్కడికెళ్లాక వీసా పొందవచ్చు.
* లండన్‌కు చెందిన సలహా సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ ప్రకారం… పెట్టుబడి వలస ప్రణాళికల కోసం ఎంక్వైరీలు చేస్తున్న భారతీయుల సంఖ్య 62 శాతం పెరిగింది .