Site icon HashtagU Telugu

2016 WH Asteroid: ఇవాళ భూమికి దగ్గరగా 2 ఆస్టరాయిడ్స్.. వాటి రూట్ మ్యాప్ ఇదీ

Earth Day 2025

Earth Day 2025

“2016 WH” అనే పేరుగల 44 అడుగుల ఆస్టరాయిడ్ ఈరోజు (ఆదివారం) భూమి వైపు దూసుకు రానుంది. 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఆస్టరాయిడ్ 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గ్రహశకలం అంత పెద్దది కాదు. మన భూమికి ఎలాంటి ముప్పును కలిగించదు.
ఆస్టరాయిడ్ వెళ్తున్న రూట్, వేగం, దూరంలను ట్రాక్ చేసి NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ఈ అంచనాకు వచ్చింది. JPL ప్రకారం.. “2016 WH” గ్రహశకలం ఇవాళ భూమికి 6.93 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి, గంటకు 42,372 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ దశలోనే “2016 WH” భూమికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి గ్రహశకలాలపై నిఘా ఉంచడానికి, వాటి కదలికలను ట్రాక్ చేయడానికి NASA టెలిస్కోప్‌లు, ఉపగ్రహాలు వంటి అనేక సాంకేతికతలను ఉపయోగిస్తోంది.

“2023 FO” కూడా వస్తోంది..

దీంతోపాటు “2023 FO” పేరు కలిగిన 15 అడుగులున్న మరో చిన్న గ్రహశకలం కూడా ఈరోజు భూమిని సమీపిస్తోంది. ఇది గంటకు 22428 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వస్తోంది. ఇది భూమికి 346000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది.

2023 DW:

2023 DW అని పిలువబడే కొత్తగా కనుగొనబడిన గ్రహశకలం 2046 వాలెంటైన్స్ డే రోజున భూమికి సమీపం నుంచి గమనం సాగించనుంది. 165 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు 1/670వ వంతు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. అయితే రాబోయే 23 సంవత్సరాలలో భూమికి దానివల్ల కలిగే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.

1908లో సైబీరియాలో..

కనీసం 50 మీటర్ల వెడల్పు గల గ్రహశకలం భూమి యొక్క వాతావరణం గుండా పడిపోతే.. అది అణుబాంబు అంత శక్తితో వాయు విస్ఫోటనాన్ని సృష్టించగలదు. తుంగుస్కా సంఘటన అని పిలువబడే అటువంటి పేలుడు 1908లో సైబీరియాలో జరిగింది. ఇది వందల వేల ఎకరాల అటవీ భూమిని మాయం చేసింది.

Also Read:  First Day @ Office: ఆఫీస్ లో మొదటి రోజు.. 4 తప్పులు చేయొద్దు సుమా..!