Warning Signs And Beer: శరీరంలో ఈ లక్షణాలు బయటపడితే.. బీర్ కు గుడ్ బై చెప్పాల్సిందే!!

బీర్ తాగడం చాలామందికి అలవాటుగా మారింది. అదొక సింపుల్ ఇష్యూ అయిపోయింది. ఆడ, మగ అనే బేధం లేకుండా చాలామంది బీర్ తాగుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 08:15 AM IST

బీర్ తాగడం చాలామందికి అలవాటుగా మారింది. అదొక సింపుల్ ఇష్యూ అయిపోయింది. ఆడ, మగ అనే బేధం లేకుండా చాలామంది బీర్ తాగుతున్నారు. బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిది అని చాలామంది నమ్ముతున్నారు.
అలాంటి వాళ్లంతా “అతి సర్వత్రా వర్జయేత్” అని గుర్తుకు ఉంచుకోవాలి. బీర్ ని అతిగా తాగితే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. రోజూ బీర్ తాగే వాళ్ళు, లిమిట్ లేకుండా బీర్ తాగే వాళ్ళు ఈ కింది లక్షణాలు కనిపిస్తే.. డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారని తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ తాగితే తలెత్తే ముఖ్య సమస్యలు..

* జీర్ణాశయ సమస్యలు
* నిద్ర లేమి
* తల నొప్పి
* స్థూలకాయం
* హై బీపీ
* లివర్ డ్యామేజ్
* హృద్రోగాలు
* డిప్రెషన్

ఒబేసిటీ చుట్టుముడుతుంది..

ముఖ్యంగా ఒబేసిటీ రావడానికి బీర్ తాగడనికి దగ్గరసంబంధం ఉంది. బీర్ అనేది 5% ఆల్కహాల్ కలిపి తయారుచేస్తారు. 1% ఆల్కహాల్ కి 7కిలో క్యాలరీస్ ఉంటాయి. 5% ఆల్కహాల్ కి 35కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఒక బీర్ బాటిల్ తాగమంటే శరీరానికి 260 క్యాలరీల శక్తి వస్తుంది. మరి ఈ రోజుల్లో ఒక బాటిల్ కంటే ఇంకా ఎక్కువ తాగుతున్నారు. కేవలం ఆల్కహాల్ లోనే కాకుండా క్యాలరీస్ ఇది తాగేటప్పుడు తీసుకునే మంచూరియన్లు, డీప్ ఫ్రైస్, ఇంకా కొన్ని ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటారు.
ఇలా 1500-2000 క్యాలరీస్ ఈజీగా వెళ్ళి పోతున్నాయి. ఇంత బీర్ లోపలికి వెళ్ళినప్పుడు దీనిని న్యూట్రిలైజ్ చేయడానికి పంపించే కెమికల్ మెకానిజం శరీరంలో మొదలై యూరిన్ అవుట్ పుట్ బాగా పెరిగి యూరిన్ బయటికి వెళ్ళినప్పుడు మినరల్స్ లాస్ అయిపోతాయి కిడ్నీలు ఉండే ఫిల్టర్స్ విటమిన్స్ ని, మినరల్స్ ని రీ అబ్సర్వ్ చేసుకుంటాయి. ఆల్కహాల్ తాగినప్పుడు వాసో ప్రెసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఫిల్టర్స్ ద్వారా మినరల్స్ రి అబ్సెప్షన్ కోల్పోయి యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. దీని ద్వారా బ్లడ్ లో ఉండే ఆల్కలినిటీ తగ్గిపోతుంది. తాగినప్పుడు బ్లడ్ లో ఉండే పీహెచ్ రెగ్యులేట్ చేస్తుంది.ఇది ఎముకల్లో ఉండే కాల్షియం, మినరల్స్ ని తీసుకొచ్చి బ్లడ్ లో కలిపేస్తుంది. ఎందుకంటే బ్లడ్ ఎప్పుడు యాసిడ్ గా ఉండకూడదు ఆల్కలినిటీ గానే ఉండాలి. దీనివల్ల ఎముకలు గొల్ల భారీ పోతాయి. అందువల్ల అధిక బరువుతో పాటు ఫ్యాటీ లివర్ వంటి ఇతర సమస్యలు బీర్ తాగడం వల్ల వస్తాయి.

కాలేయానికి దెబ్బ..

బీరులో ఆల్కహాల్ కూడా ఉంటుంది. 650 మి. లీ బీర్ లో 5 నుంచి 7.5 % వరకు బ్రాందీ విస్కీ కలవు. ఇక మిగిలిన 42.8% లో వైన్ 6-24% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మనం ప్రతిరోజు 90 ml కంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది మన కాలేయం మీద చాలా ప్రభావం చూపుతుందట. కాలేయం పరిమాణం అనేది కుచించుకుపోతుంది.ఇక దీన్నే ‘లివర్‌ సిర్రోసిస్‌’ అంటారు. కడుపులో ఉండే జిగురు పొరను ఆల్కహాల్ చాలా దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా అల్సర్లు ఏర్పడి రక్త వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.

‘హైపోగ్లేసిమియా’..

బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం ఇంకా అలాగే పొటాషియం వంటి మూలకాలు అనేవి మూత్రం ద్వారా బయటకు పోతాయి. డయాబెటిస్ రోగుల్లోని రక్తంలో చక్కెర స్థాయి అనేది ఒక్కసారిగా తగ్గి.. ‘హైపోగ్లేసిమియా’ అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఏర్పడుతుంది.బీర్ ఎక్కువగా తాగడం వల్ల మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది. ఇక శ్వాసవ్యవస్థపై ప్రభావం పడి.. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది.