Site icon HashtagU Telugu

Too Much Work: డిజిటల్ పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లలు పుట్టరా.. ఇందులో నిజమెంత?

4-Day Work

Too Much Work

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తూనే ఉన్నారు. కంప్యూటర్లు,స్మార్ట్ ఫోన్లు లాప్టాప్ లు, ట్యాబ్ లు, టీవీలు ఇలా ప్రతి ఒకరు కూడా ఎలక్ట్రానిక్ పరికరాల వద్ద గంటలకు సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు దాదాపు 8, 9 గంటల పాటు సిస్టం ముందే అలాగే కూర్చొని ఉంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా అందులో భాగంగానే ఇన్‌ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు బాధపడుతూ ఉంటారు. ఒక పరిశోధన ప్రకారం.. 10 నుంచి 15 శాతం జంటలు పిల్లలు ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు.

ఈ సమస్యలతో బాధపడుతున్న చాలా మంది మహిళలు డిప్రెషన్‌తో కూడా బాధపడుతున్నారు. ఇది కాకుండా ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ రెగ్యులర్‌గా అండాశయ హైపర్ స్టిమ్యులేషన్, రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ల వంటి వివిధ సమస్యలని కలిగిస్తాయి. సంతానలేమి ఒక్కటే కాదు. ఎక్కువ పని, ఒత్తిడి వల్ల గర్భం దాల్చినా అనేక సమస్యలు వస్తాయి. దీని వల్ల అబార్షన్, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, శారీరక వైకల్యం , శిశువు ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ప్రీ ఎక్లాంప్సియా వల్ల వచ్చే సమస్యలు, బిడ్డ బరువు తగ్గడం వల్ల వచ్చే సమస్యలన్నీ ఇలా ఎక్కువసేపు పనిచేయడం వల్లే అని చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు పెద్ద వారు చేస్తున్న ప్రధాన తప్పు చీకటిలో స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించడం.

చీకటిలో ఎక్కువసేపు మొబైల్ ని వాడడం వల్ల శరీర గడియారానికి అంతరాయం కలుగుతుంది. ఇది శారీరక శ్రమకి అంతరాయం కలుగుతుంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుది. దీని కారణంగా పునరుత్పత్తి ఆరోగ్యంపై ఎఫెక్డ్ పడుతుంది. ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బీపి, మధుమేహం, ఊబకాయం, ఇవన్నీ కూడా ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతుంది. సంతానోత్పత్తి తగ్గడం, అబార్షన్, నెలలు నిండకుండానే పుట్టడం జరుగుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ కారణాల్లో మానసిక ఒత్తిడి కూడా ఒకటి. ఒత్తిడి పెరగడం వల్ల ఆడవారికి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. అంతేకాకుండా, హార్మోన్ల సమస్యలకి కారణమవుతుంది.

అదేవిధంగా మహిళలు ఎక్కువసేపు వర్క్ చేస్తే వారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం, మగ హార్మోన్ ఆండ్రోజెన్ పెరుగుదల పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఆడవారు బరువైన వస్తువులని ఎత్తడం, పక్కకి జరపడం చేస్తుంటారు. ఇలా అతిగా వంగడం, ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల సంతానలేమి సమస్యలు వస్తాయి. శారీరకంగా ఎక్కువగా ఇబ్బంది పడడం మహిళల్లో అండోత్సర్గాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల గర్బధారణపై ఎఫెక్ట్ చూపిస్తుంది.