Hair Loss: హెయిర్ లాస్ పై మీ అపోహలన్నీ ఇక క్లియర్

జుట్టు రాలడం (Hair Loss) అనేది అత్యంత సాధారణ చర్మ సమస్యలలో ఒకటి. ఇది ఎవరికైనా.. ఎప్పుడైనా రావచ్చు. జుట్టు రాలడాన్ని మెడికల్ టర్మీనాలజీలో "అలోపేసియా" అంటారు. ఈ ప్రాబ్లమ్ పురుషులు , స్త్రీలలో అందరిలో వస్తుంది.  ఒక రోజులో 50 నుంచి 100 జుట్టు తంతువులు రాలిపోతాయని అంటారు. వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వెంట్రుకలు వస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 03:00 PM IST

జుట్టు ఎందుకు రాలుతుంది?  తరచుగా కడగడం, షాంపూ చేయడం వల్ల జుట్టు రాలిపోతుందా ? ఆరోగ్య స్థితి.. హార్మోన్ మార్పులు.. పోషకాహార లోపం.. మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుందా? ఈ అంశాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..!

జుట్టు రాలడం (Hair Loss) అనేది అత్యంత సాధారణ చర్మ సమస్యలలో ఒకటి. ఇది ఎవరికైనా.. ఎప్పుడైనా రావచ్చు. జుట్టు రాలడాన్ని మెడికల్ టర్మీనాలజీలో “అలోపేసియా” అంటారు. ఈ ప్రాబ్లమ్ పురుషులు , స్త్రీలలో అందరిలో వస్తుంది.  ఒక రోజులో 50 నుంచి 100 జుట్టు తంతువులు రాలిపోతాయని అంటారు. వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వెంట్రుకలు వస్తుంటాయి.

◆ జుట్టు రాలడం 2 రకాలు

జుట్టు రాలడం(అలోపేసియా) 2 రకాలు. వీటిలో ఒకటి స్కార్రింగ్ అలోపేసియా (Scarring alopecia), రెండోది నాన్ స్కార్రింగ్ అలోపేసియా (non scarring alopecia).

◆ స్కార్రింగ్ అలోపేసియా

స్కార్రింగ్ అలోపేసియా వస్తే మీ హెయిర్ ఫోలికల్స్ (మీ చర్మం ఉపరితలంపై ఉన్న షాఫ్ట్‌ల ద్వారా జుట్టు పెరుగుతుంది) దెబ్బతింటాయి.హెయిర్ ఫోలికల్స్ అంటే జుట్టు కుదుళ్ళు. స్కార్రింగ్ అలోపేసియా అనేది సాధారణంగా అంటువ్యాధులు, రసాయనాలు, కాలిన గాయాలు లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల వస్తుంది. ఫోలికల్‌కు నష్టం జరిగితే మళ్లీ కోలుకోవడం కష్టం. సకాలంలో వైద్యం చేయించుకోవాలి. లేదంటే జుట్టు రాలడం కంటిన్యూ అవుతుంది.

◆ నాన్ స్కార్రింగ్ అలోపేసియా

నాన్ స్కార్రింగ్ అలోపేసియా వస్తే.. జుట్టు కుదుళ్లను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ తాత్కాలికం. హార్మోన్ల మార్పులు, గర్భం, సరైన ఫుడ్ తినకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

◆ ఒత్తిడి వల్ల జుట్టు రాలడం నిజమా?

జుట్టు రాలడానికి ఒత్తిడి ఒక్కటే కారణం కాదు. వాతావరణ మార్పులు, దీర్ఘకాలిక అనారోగ్యం, మందులు , కొన్ని హార్మోన్ స్వింగ్‌ల వల్ల జుట్టు రాలుతుంటుంది. జుట్టు సాధారణంగా నెలకు 2 సెం.మీ చొప్పున వేగంగా పెరుగుతుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
జుట్టు కుదుళ్లలోని పాజ్ బటన్ వాటి పెరుగుదల వేగాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల జుట్టు రాలే సమస్య వచ్చినా అది పర్మినెంట్ గా ఉండదు.

◆ బట్టతల వయసు పైబడిన వారికేనా?

వయసు పైబడిన వారికి మాత్రమే బట్టతల వస్తుంది అనేది
నిజం కాదు. బట్టతల అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. జన్యువులు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మందుల దుష్ప్రభావాలు వీటిలో దేనివళ్లయినా బట్టతల రావచ్చు. కుటుంబంలో గతంలో ఎవరికయినా బట్టతల ఉంటే.. భవిష్యత్ తరాలకు కూడా అది వచ్చే ఛాన్స్ ఉంటుంది.

◆ జుట్టు రాలడం అనేది కేవలం మగవారి సమస్యా ?

జుట్టు రాలడం అనేది కేవలం మగవారి సమస్యా ? అంటే కాదు.ఇది పురుషులలో సర్వ సాధారణమైనప్పటికీ స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ ప్రకారం.. DHT అనేది ఆండ్రోజెన్ (హార్మోన్). ఇది శరీర వెంట్రుకలతో సహా పురుష లింగ లక్షణాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది అధిక స్థాయిలో జుట్టు రాలడానికి కూడా దారి తీస్తుంది.  జన్యు లక్షణాల ఆధారంగా..హార్మోన్ స్థాయిలను బట్టి మీ జుట్టు కుదుళ్లు ఎక్కువ లేదా తక్కువ సున్నితంగా ఉండవచ్చు.

◆ మహిళల్లో ఆ కారణాలతో

మెనో పాజ్ తర్వాత లేదా థైరాయిడ్ అసమతుల్యత కారణంగా మహిళలు జుట్టు కోల్పోతారు. అయితే ఇది జుట్టు ముందు భాగంలో ఎక్కువ కనిపిస్తుంది. తల జుట్టు ముందు భాగంలోని హెయిర్స్ పలుచబడతాయి. వెనుక భాగంలో మందంగానే ఉంటాయి.

◆ తలకు షాంపూ వారానికి 2 సార్లే

.మీ జుట్టును తరచుగా కడగడం మరియు షాంపూ చేయడం వల్ల దాని పెరుగుదలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. స్నానం చేసే సమయంలో, వదులుగా ఉన్న వెంట్రుకలు రాలిపోవడం వల్ల మీరు షాక్‌కు గురవుతారు. దువ్వుకునే సమయంలో పొడిగా ఉన్న జుట్టు రాలిపోతే ఆందోళనకు గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ స్కాల్ప్ ను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా చెమట పట్టే వారు స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచు కోవాలి. అయితే, షాంపూని అతిగా వాడటం వల్ల స్కాల్ప్ యొక్క pH విలువ దెబ్బ తింటుంది. చాలా మంది పురుషులు సాధారణంగా రోజూ స్నానం చేసే సమయంలో తలని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటారు. వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవచ్చు.  అంతకంటే ఎక్కువ సార్లు షాంపూ వాడటం బెటర్ కాదు.

◆ విటమిన్లు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందా ?

విటమిన్లు తీసుకోవడం లేదా విటమిన్ లోషన్‌ను మీ తలపై రుద్దడం వల్ల జుట్టు పెరుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు.  వెంట్రుకల పెరుగుదల కోసం బయోటిన్ ఎక్కువగా వాడుతుంటారు. ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఫోలికల్స్‌ను పోషించడానికి సరిపోతుంది. మీకు నిజానికి సప్లిమెంట్స్ అవసరం లేదు. బయోటిన్ యొక్క ఉత్తమ సహజ వనరులు మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలు.

◆ జుట్టు కత్తిరించుకుంటే వేగంగా, మందంగా పెరుగుతుందా?

జుట్టును తరచుగా కత్తిరించు కోవడం వల్ల అది తిరిగి మందంగా, వేగంగా పెరుగుతుందని అనుకుంటారు.హెయిర్ కట్ అనేది వ్యక్తిగత సౌలభ్యం మరియు నిర్వహణ కోసం మాత్రమే. మీ జుట్టు ఎంత వేగంగా లేదా మందంగా పెరుగుతుంది అనే దానికి దానితో సంబంధం లేదు.

◆ సూర్యకాంతికి జుట్టు రాలుతుందా?

తలపై ఎక్కువ టైం పాటు నేరుగా సూర్యకాంతి పడితే దీర్ఘకాలంలో జుట్టు రాలడానికి కారణమవు తుందని చాలామంది అనుకుంటారు.ప్రత్యక్ష సూర్యకాంతి మీ చర్మానికి హానికరం కానీ అది జుట్టు రాలడానికి కారణం కాదు. ఎందుకంటే కిరణాలు నెత్తిమీదికి గుచ్చుకోలేవు. మీ జుట్టు కుదుళ్లను ప్రభావితం చేయలేవు.

◆ స్కాల్ప్‌కు మసాజ్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?

స్కాల్ప్‌కు మసాజ్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని చాలామంది భావిస్తారు. ఇది నిజం కాదు. మీరు మీ జుట్టును మరింత పాడు చేయకూడదనుకుంటే, ఈ అభ్యాసానికి దూరంగా ఉండండి.