Rahul Gandhi: మోడీ దీపావ‌ళి ధ‌ర‌ల‌పై రాహుల్ ఫైర్

``సామాన్యుల ప‌ట్ల మాన‌వీయ కోణం లేకుండా మోడీ సర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ద్ర‌వ్యోల్బ‌ణం అత్య‌ధిక స్థాయికి చేరింది.

  • Written By:
  • Updated On - November 4, 2021 / 12:23 AM IST

“సామాన్యుల ప‌ట్ల మాన‌వీయ కోణం లేకుండా మోడీ సర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ద్ర‌వ్యోల్బ‌ణం అత్య‌ధిక స్థాయికి చేరింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత రికార్డ్ స్థాయికి మోడీ చేర్చాడు. కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పేద‌వాడికి అంద‌నంత ఎత్తుకు ఎగ‌బాకాయి..“ ఇది మోడీ ద్ర‌వ్యోల్బ‌ణం అంటూ రాహుల్ చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీట‌రు పెట్రోలు రూ. 120ల‌కు చేరింది. కేంద్రం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 2.3ల‌క్ష‌ల కోట్లు పెట్రోలు, డీజిల్ పై ప‌న్నుల రూపంలో వ‌సూలు చేసింది. 2017-18వ ఏడాది 2.58లక్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల నుంచి రాబ‌ట్టింది. 75ఏళ్ల స్వాతంత్ర్య భార‌తావ‌నిలో `ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వం`లా రికార్డ్ స్థాయిలో ధ‌ర‌లు పెర‌గ‌డ‌మ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశాడు. దీపావ‌ళి ముందు స్వీట్స్ ధ‌ర‌లు పెరిగేలా వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ. 266 మేర‌కు పెంచ‌డం గ‌మ‌నార్హం. భార‌త దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం అదుపు త‌ప్పింది. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కూర‌గాయాలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ , నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు క‌ళ్లెంలేని గుర్రంలా ప‌రుగెడుతున్నాయి. మానీవీయ కోణంలేని మోడీ స‌ర్కార్ మీద కాంగ్రెస్ నేత‌లు షోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. దీపావ‌ళి ధ‌మాఖాలాగా ధ‌ర‌ల బాంబ్ ల‌ను ప్ర‌జ‌ల మీద కేంద్రం వేసింది.

Also Read : ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే

Also Read : అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు