కేంద్ర ఎన్నికల కమిషనర్, సభ్యులను(Supreme orders) నియమించే విషయంలో పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీని(Panel) ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారని తెలిచేసింది. ఆ మేరకు ప్యానెల్ ఉండాలని సూచిస్తూ సుప్రీంకోర్టు గురువారం కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఈ కమిటీ అమలులో ఉంటుందని జస్టిస్ జోసెఫ్ చెప్పారు . జస్టిస్ కె.ఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల కమిషనర్, సభ్యులను నియమించే విషయంలో…(Supreme orders)
సివిల్ సర్వెంట్లను లొంగ తీసుకోవడం నుంచి ఎన్నికల సంఘం దూరంగా ఉండాలని సుప్రీం(Supreme orders) భావించింది. స్వేచ్ఛగా , పారదర్శకంగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. ఎన్నికల కమిషన్ కొన్ని సందర్భాల్లో హాని కలిగించేలా కృత్రిమ పరిస్థితికి దారితీస్తుందని (Panel)అభిప్రాయపడింది. దాని సమర్థవంతమైన పనితీరును దూరం అవుతుందని పేర్కొంది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలను సిఫార్సు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలను..
రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి న్యాయమైన , చట్టబద్ధమైన పద్ధతిలో ఎన్నికల కమిషన్ ఉండాలని సుప్రీం కోర్టు (Supreme orders)అభిప్రాయపడింది. అందుకు కమిషన్ బాధ్యత వహించాలని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా , న్యాయంగా నిర్వహించబడితే సామాన్యుడి చేతిలో శాంతియుత విప్లవాన్ని (Panel)సులభతరం చేస్తుందని బెంచ్ పేర్కొంది.
Also Read : Supreme Court: సుప్రీం కోర్టు జడ్జీలుగా మరో ఐదుగురికి పదోన్నతి .. వారిలో ఓ తెలుగు జడ్జి..!
వాస్తవంగా ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మీద పలు ఆరోపణలు రావడం పరిపాటిగా మారింది. స్వేచ్ఛ యుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడంలేదన్న ఆరోపణలు కోకొల్లలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉందని పలుమార్లు ప్రత్యర్థులు ఆరోపించారు. అంతేకాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల అక్రమాలపై పలు రకాలుగా అనుమానాలు ఉన్నాయి. వాటి మీద వివరాలు అడిగినప్పటికీ పారదర్శక సమాధానంలేదని న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూలకు చెక్ పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్వచ్ఛ అవసరం. అందుకే దాని సంస్కరణల కోసం సుప్రీం కోర్టు (Supreme orders) కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
Also Read : Supreme Court: న్యాయమూర్తిగా గే లాయర్!.. కొలీజియం సిఫారుసుకు కేంద్రం ఆమోదం చెప్పేనా?
సాధారణ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సుప్రీం కోర్టు సంచలన (Panel) నిర్ణయం తీసుకుంది. అత్యున్నత పదవుల్లోని వాళ్ల ప్యానెల్ ద్వారా ఎన్నికల కమిషనర్ , సభ్యులను ఎంపిక చేయాలని తీర్పు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ మీద పలువురు చేస్తోన్న ఆరోపణలు, అనుమానాలకు తెరదించుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఫలితాలను ఇస్తుందో చూడాలి.
Also Read : Supreme Court : కేంద్రంపై సుప్రీం గుస్సా.. ప్రధానిని ప్రశ్నించే దమ్మునోడు కావాలి.!!