Sonia Gandhi Invite To AAP : విపక్ష కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న పరిణామాలు కీలక మలుపు తిరిగాయి..
బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో (సోమ, మంగళవారాలు) జరిగే విపక్ష మీటింగ్ కు రావాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం అందింది.
ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొననున్నారు.
కాంగ్రెస్ ను బాహాటంగా విమర్శిస్తున్నప్పటికీ.. ఢిల్లీ, పంజాబ్ లలో బలంగా ఉన్న ఆప్ ను వదులుకునేందుకు విపక్ష కూటమి రెడీగా లేదని దీంతో స్పష్టమైంది.
మరో కీలకమైన విషయం ఏమిటంటే.. బెంగళూరు మీటింగ్ కు ఒకరోజు ముందు (జూలై 17 న) సోనియాగాంధీ విపక్ష పార్టీల నేతలకు విందు (డిన్నర్) ఇవ్వనున్నారు.
ఈ డిన్నర్ కు కూడా ఆప్ ను ఆహ్వానించడం గమనార్హం.
ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సఖ్యత, ఐక్యతను పెంచేందుకు ఈ డిన్నర్ ను(Sonia Gandhi Invite To AAP) సోనియా ఇస్తున్నట్టు తెలుస్తోంది.
Also read : Good News Moviegoers : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఇక చీప్
ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ లిఖిత పూర్వక మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది. అయితే జూలై 17 డిన్నర్ వేదికగా సోనియా గాంధీ దీనిపై కేజ్రీవాల్ కు ఏదైనా హామీ ఇస్తారా ? ఆర్డినెన్స్ అంశంలో మద్దతును ప్రకటిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు బెంగళూరులో జులై 17, 18 తేదీల్లో జరిగే విపక్ష మీటింగ్ లో మొత్తం 24 పార్టీలు పాల్గొంటాయని సమాచారం. ఇంతకుముందు జూన్ 23న జరిగిన విపక్షాల మొదటి మీటింగ్ లో 15 పార్టీలు మాత్రమే పాల్గొన్నాయి. ఈ నెల రోజుల వ్యవధిలో మరో 8 పార్టీలను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోగలిగింది. బెంగళూరు మీటింగ్ లో పాల్గొననున్న 8 కొత్త పార్టీల లిస్ట్ లో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) ఉన్నాయి.
Also read : Garuda Drone Flood Fight : వరదలపై డ్రోన్ల యుద్ధం.. టెక్నాలజీని వాడుకుంటున్న ఎన్డీఆర్ఎఫ్
2014 ఎన్నికల సమయంలో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరించిన KDMK, MDMK పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు రావడం మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతం. మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీలో చీలిక ఏర్పడి.. అజిత్ పవార్ 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో జులై 18 మీటింగ్ ప్రాధాన్యాన్నిసంతరించుకుంది. విపక్ష పార్టీల సంఖ్య పెరగడం బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు బలం ఇవ్వనుంది.