New Criminal Laws : జులై 1 నుండి కొత్త నేర చట్టాలు అమలు

బ్రిటీష్‌ కాలం నాటి శిక్షా స్మృతులే అమల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటిని సంస్కరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 12:43 PM IST

కొత్త నేర చట్టాలు (New Criminal Laws) జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రకటన చేశారు.నేటికీ బ్రిటీష్‌ కాలం నాటి శిక్షా స్మృతులే అమల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటిని సంస్కరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కేంద్ర రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్‌లలో కొన్నింటిని సవరించి కొత్త కోడ్‌లతో సరికొత్త నిబంధనలతో రూపొందించి అమలకు సర్వం సిద్ధం చేశారు.

మారిన చట్టాలు (New Criminal Laws) ఇవే

1.ఐపీసీ (పాతది) – భారతీయ న్యాయ సంహిత (కొత్తది )

2. సీఆర్పీసీ (పాతది) – భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (కొత్త )

3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (పాత ది) – భారతీయ సాక్ష్య అధినియం (కొత్తది)

ఈ నేపథ్యంలో కొత్త చట్టాల పై అవగాహనా కోసం ప్రత్యేక న్యాయ విధాన పరిషత్, సదస్సులు, శిక్షణ కార్యక్రమలు విరివిగా ఏర్పాట్లు చేసి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐపీసీ1860 కి బదులుగా భారతీయ న్యాయ సంహిత 2023, సి.ఆర్.పి.సి.1973 బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్ 1872 బదులుగా భారతీయ సాక్ష్య అధినియం 2023 లు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. నూతన చట్టాల అమలుపై సమీక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది డిసెంబర్ 21న రాజ్యసభ ఈ బిల్లులకు ఆమోదం తెలపగా.. డిసెంబర్ 20న వాటిని లోక్‌సభ ఆమోదించింది. కొత్త సవరించిన చట్టాల ప్రకారం ‘నేరం జరిగిన 30 రోజులలోపు వారి నేరాన్ని అంగీకరించినట్లయితే.. అప్పుడు శిక్ష తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త చట్టాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి గడువు నిర్ణయించబడింది. విచారణ నివేదికను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించిన తర్వాత, దానిని 24 గంటల్లోగా కోర్టు ముందు సమర్పించాలి. మెడికల్ రిపోర్టును నేరుగా పోలీసు స్టేషన్/కోర్టుకు ఏడు రోజుల్లో పంపాలనే నిబంధన ఉంది. చార్జిషీట్ ఇకపై 180 రోజుల తర్వాత పెండింగ్‌లో ఉంచబడదు. అలాగే ఇప్పుడు నిందితులకు నిర్దోషిగా ప్రకటించడానికి ఏడు రోజుల సమయం ఉంటుందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఒక న్యాయమూర్తి ఆ ఏడు రోజుల్లో విచారణ జరపాలి. గరిష్టంగా 120 రోజులలో కేసు విచారణకు వస్తుంది. ముందుగా (ప్లీజ్) బేరసారాలకు ఇందులో కాలపరిమితి లేదని స్పష్టం చేశారు.

ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సుమారు 120 సంవత్సరాలనుండి నుండి వస్తున్న పాత చట్టాలు ప్రస్తుతం సమాజ స్థితులకు అనుగుణంగా లేవని డాక్టర్ రణబీర్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు భారత దేశ న్యాయ వ్యవస్థలో మార్పులు తీస్కొని రావడమే లక్ష్యంగా కేంద్రం నూతన చట్టాలు తీసుకొచ్చింది. ఈ మూడు కొత్త క్రిమినల్‌ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలైంది. ఈ మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం – 2023 జులై 1 నుండి అమల్లోకి రావాల్సి వుంది. అంజలి పటేల్‌, ఛాయా మిశ్రా ఈ రిట్‌ పిటిషన్‌ వేశారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ను, న్యాయ వ్యవస్థను ప్రక్షాళనం చేస్తున్న ఈ మూడు కొత్త చట్టాల సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు తక్షణమే నిపుణుల కమిటీని నియమించాలని వారు సుప్రీంకోర్టును కోరారు.

Read Also : Bike Riding Tips: వర్షకాలంలో బైక్ నడిపేవాళ్ల కోసం కొన్ని ట్రిక్స్..!