నోట్ల రద్దై ఐదేళ్లు…ప్రజల దగ్గర పెరుగుతన్న డబ్బులు

నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ను ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అవుతున్నా కూడా ప్రజల వద్ద ఉన్న డబ్బు క్రమంగా పెరుగుతూనే ఉందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 6, 2021 / 12:44 PM IST

నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ను ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అవుతున్నా కూడా ప్రజల వద్ద ఉన్న డబ్బు క్రమంగా పెరుగుతూనే ఉందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం గత ఏడాది అక్టోబర్ 23, 2020 నాటికి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ. 15,582 కోట్లు పెరిగింది. అంటే 8.5 శాతం (దాదాపు రూ.2.21 లక్షల కోట్లు ) పెరిగింది.ఈ ఏడాది అక్టోబర్ 8, 2021తో ముగిసిన పక్షం రోజుల్లో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ గరిష్టంగా రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది రూ. 17.97 లక్షల కోట్ల నుండి 57.48 శాతం అంటే రూ. 10.33 లక్షల కోట్లు పెరిగింద ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. నవంబర్ 2016లో రూ.500, రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ జనవరి 2017 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ డిజిటలైజేషన్తో పాటు లావాదేవీలపై పరిమితులు విధించింది. కొత్త నోట్ల కోసం సామాన్యులు తీవ్ర అవస్థలు పడాల్సివచ్చింది. ఆ తరువాత కరోనా మహామ్మారి విజృంభించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ని విధించాయి. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం నగదును కూడబెట్టుకోవడం ప్రారంభించారు.

Also Read : పొలిటిక‌ల్ హీరో “స్టాలిన్”..త‌మిళ‌నాట రాజ‌కీయ విప్ల‌వం

నవంబర్ 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దేశ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నాయి. జీడీపీ వృద్ధి రేటు దాదాపు 1.5 శాతం క్షీణించింది. నోట్ల రద్దు తరువాత చిన్న చిన్న పరిశ్రమలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. నోట్ల రద్దు తర్వాత తగ్గిన కరెన్సీ, జీడీపీ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దాదాపు FY20 వరకు GDP నిష్పత్తికి చలామణిలో ఉన్న నగదు 10-12 శాతంగా ఉంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి తర్వాత FY25 నాటికి CIC నుండి GDP 14 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. నోట్ల రద్దు తరువాత డిజిటల్ పేమెంట్స్ క్రమంగా పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో GDP నిష్పత్తికి చెలామణిలో ఉన్న మొత్తం ఆర్థిక వృద్ధికి అనుగుణంగా పెరిగినట్లు డేటా సూచిస్తుంది.

Also Read : నగలు అమ్మి.. లక్షల మంది దాహం తీర్చింది!

భారతదేశంలోని ప్రాంతాలు మరియు ఆదాయ వర్గాలలో లావాదేవీల్లో నగదు ప్రధాన మాధ్యమంగా కొనసాగుతోందని CMS ఇన్ఫో సిస్టమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కౌల్ అన్నారు. FY21లో, CMS నెట్వర్క్ కంపెనీ తిరిగి నింపే 63,000 ATMల ద్వారా మరియు 40,000 రిటైల్ మరియు ఎంటర్ప్రైజ్ చైన్ల ద్వారా రూ.9.15 లక్షల కోట్లకు పైగా కరెన్సీని తరలించిందని ఆయన తెలిపారు. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ లావాదేవీల కోసం నగదు చెల్లింపులపై ఆధారపడినందున నగదు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. దాదాపు 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతా లేకుండా నగదు అనేది ప్రధాన లావాదేవీ విధానమని… అంతేకాకుండా 90 శాతం ఇ-కామర్స్ లావాదేవీలు టైర్ వన్ నగరాల్లో 50 శాతంతో పోలిస్తే టైర్ ఫోర్ సిటీలలో నగదును చెల్లింపు విధానంగా ఉపయోగిస్తున్నాయని తెలిపారు. CMS క్యాష్ ఇండెక్స్ 2018 నుండి గత మూడు సంవత్సరాలలో జరుగుతున్నట్లుగా పండుగ సీజన్ ప్రారంభంతో ఆర్థిక వ్యవస్థలో నగదు అవసరం గణనీయంగా పెరిగిందన్నారు.