Anti Drone Gun: Chimera 100.. మేడిన్ ఇండియా యాంటీ డ్రోన్ గన్ రెడీ.. ఇక చైనా, పాక్ కు చుక్కలే!!

బార్డర్ లో చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టేందుకు ఇండియాలో ఒక కొత్త అస్త్రం తయారైంది.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 08:10 AM IST

బార్డర్ లో చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టేందుకు ఇండియాలో ఒక కొత్త అస్త్రం తయారైంది. దాని పేరే.. “Chimera 100”. ఇది మామూలు గన్ కాదు. సూపర్ గన్. నేటి కాలంలో దడ పుట్టిస్తున్న డ్రోన్ల పని పట్టగల అడ్వాన్స్డ్ తుపాకీ ఇది. దీన్ని మన ఇండియా కు చెందిన గోద్రెజ్ కంపెనీ, ఫ్రాన్స్ కు చెందిన సెర్ బైర్ (CERBAIR) కంపెనీ అభివృద్ధి చేశాయి. దీని తయారీ కూడా ఇండియాలోనే జరుగుతోంది. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి దూసు కొస్తున్న డ్రోన్ ను Chimera 100 గుర్తిస్తుంది.

దానికి శత్రువుల సైనిక స్థావరం నుంచి అందే సిగ్నల్స్ ను ఆపేస్తుంది. ఇది జరిగిన కాసేపటికే.. రెక్కలు తెగిన పక్షిలా డ్రోన్ కుప్ప కూలిపోతుంది. అయితే ఈ గన్ ను వినియోగించే సైనికుడు అతడి వీపుకు ఒక బాక్స్ ను పెట్టుకోవాలి. ఆ బాక్స్ ను ఆన్ చేసి పెడితే.. చుట్టుపక్క ప్రాంతాల నుంచి వచ్చే డ్రోన్స్ పై సమాచారం అందుతుంది. ఆ వెంటనే వెనుక ఉన్న బాక్స్ నుంచి సౌండ్ అలర్ట్ వస్తుంది. ఏ దిక్కులో డ్రోన్ ఉంది? అనే విషయాన్ని కూడా వెనుకనున్న ట్రాకింగ్ సిస్టం చూపిస్తుంది. దీని ప్రకారం యాంటీ డ్రోన్ గన్ కు పని చెబితే.. అటువైపుగా ఉండే డ్రోన్స్ కుప్పకూలుతాయి. భవిష్యత్ లో ఈ మేడిన్ ఇండియా యాంటీ డ్రోన్ గన్స్ మన సైన్యం అమ్ములపొదిలోకి చేరే ఛాన్స్ కూడా ఉంది. దీన్ని సైన్యం వినియోగంలోకి తెస్తే.. బార్డర్ లో చైనా, పాక్ డ్రోన్ల బెడదకు చెక్ పడుతుంది. సియాచిన్ గ్లేసియర్ , చైనా ఇండియా సున్నిత సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ గన్స్ వస్తే ఇండియా ఆర్మీ మరింత పవర్ ఫుల్ గా మారుతుంది.

డ్రోన్స్ అంటే ఏమిటి?

వివాహాల సమయంలో ఫోటోగ్రఫీ కోసం డ్రోన్లు ఉపయోగించడాన్ని మీరు తరచుగా చూస్తూ ఉండి ఉంటారు. డ్రోన్‌లను మానవరహిత వైమానిక వాహనం (యుఎవి) అని పిలుస్తారు. అంటే, మానవరహిత విమానం. అవి రిమోట్‌గా నియంత్రించే ఏర్పాటు కలిగి ఉంటాయి. వీ టిని ఎగరడానికి పైలట్ అవసరం లేదు. రిమోట్‌ సహాయంతో  రిమోట్‌గా నియంత్రించబడే ఆకాశంలో ఎగురుతున్న రోబోగా  వీటిని భావించవచ్చు.

డ్రోన్ దాడులు ఎలా జరుగుతాయి?

డ్రోన్లను అనేక దేశాల సైన్యాలు ఉపయోగిస్తాయి. అవి చిన్నవిగా ఉంటాయి  కాబట్టి, రాడార్లు సులభంగా వాటిని పట్టుకోలేవు.  అలాగే నిశ్శబ్దంగా కష్టతరమైన ప్రాంతాలలోకి చాలా సులువుగా చొరబడవచ్చు. ఈ కారణంగా, సైన్యంలోవీటి  ఉపయోగం పెరగడం ప్రారంభమైంది.
డ్రోన్ దాడులు రెండు విధాలుగా జరుగుతాయి. ఒక మార్గం ఏమిటంటే, డ్రోన్‌లో ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలు నింపుతారు.  డ్రోన్ ఈ ఆయుధాలను దాని లక్ష్యంలో పడేస్తుంది. ఒక విమానం నుండి క్షిపణిని ప్రయోగించిన విధంగానే ఇది ఉంటుంది.
డ్రోన్ దాడి మరొక పద్ధతి ఏమిటంటే, డ్రోన్‌ను పేలుడు పదార్థంగా మార్చడం. అంటే, డ్రోన్ తన లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతుంది. ఆత్మాహుతి బాంబు లా అన్నమాట.