Site icon HashtagU Telugu

Hyderabad-Skyroot : హైదరాబాద్ “స్కై రూట్” రాకెట్లతో ఫ్రాన్స్ శాటిలైట్ల మోహరింపు.. ఖరారైన డీల్

Hyderabad Skyroot

Hyderabad Skyroot

Hyderabad-Skyroot : హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ “స్కైరూట్ ఏరోస్పేస్”, ఫ్రెంచ్  స్పేస్ టెక్ కంపెనీ “ప్రోమేథీ” మధ్య  కీలకమైన ఒప్పందం కుదిరింది. శాటిలైట్స్ సమూహాలను నిర్ణీత  కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రాజెక్టులపై  కలిసి పని చేసేందుకు సంబంధించి  ఈ రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ  ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ ఎంఓయూపై సంతకాలు జరిగాయి. “స్కైరూట్ ఏరోస్పేస్”,”ప్రోమేథీ” కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

Also read : Asian Games: ఆసియా క్రీడల కోసం భారత పురుషుల, మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్..!

ఏమిటీ డీల్ ? 

స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న “విక్రమ్-సిరీస్” లాంచ్ వెహికల్స్‌ని ఉపయోగించి ఫ్రాన్స్ కంపెనీ ప్రోమేథీ తన “జెఫ్టస్ ఎర్త్ ఆబ్సర్వేషన్ కాన్స్టలేషన్” ( JAPETUS earth observation constellation) ప్రాజెక్ట్ కు సంబంధించిన నానో శాటిలైట్‌లను నిర్ణీత కక్ష్యలోకి  ప్రవేశపెట్టనుంది. ఈ డీల్ కు ముందు స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన, ప్రోమెతీ ప్రెసిడెంట్ ఒలివియర్ పీప్స్జ్‌ మధ్య  చర్చలు జరిగాయి.

Also read : Project K Glimpse: ‘ప్రాజెక్ట్-కే’ నుంచి బిగ్ అప్డేట్.. ఈనెల 21న ఫస్ట్ గ్లింప్స్..!

స్కైరూట్ ఏరోస్పేస్ నేపథ్యం .. 

స్కైరూట్ ఏరోస్పేస్(Hyderabad-Skyroot) ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా 2022 నవంబర్‌లో మొట్టమొదటి ప్రైవేట్‌ అంతరిక్ష రాకెట్ విక్రమ్-ఎస్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చెందిన యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి విక్రమ్ సిరీస్ రాకెట్ల 3 వేరియంట్‌లను అభివృద్ధి చేస్తోంది. విక్రమ్-I అనే  రాకెట్  వేరియంట్‌ 480 కిలోగ్రాముల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌కు మోసుకెళ్లగలదు. విక్రమ్-II అనే రాకెట్  వేరియంట్‌ 595 కిలోగ్రాముల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌కు మోసుకెళ్లగలదు. విక్రమ్-III  అనే రాకెట్  వేరియంట్‌ 815 కిలోల పేలోడ్‌ ను 500 కి.మీ తక్కువ వంపు కక్ష్య వరకు తీసుకెళ్లి మోహరించగలదు.