First solar eclipse of 2022: నేడు సూర్యగ్రహణం..ఎలా, ఎప్పుడు, ఎక్కడ చూడాలి..!!

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం...ఇదే రోజు వైశాఖ అమావాస్య కూడా ఏర్పడనుంది. సూర్య గ్రహణాలు చాలా వరకు అమావాస్య రోజున ఏర్పాడతాయి. కానీ ఈ సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రునిచే పూర్తిగా కప్పబడి ఉంటాడు. దీంతో సూర్యకిరణాలు భూమిని తాకలేవు.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 12:33 PM IST

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం…ఇదే రోజు వైశాఖ అమావాస్య కూడా ఏర్పడనుంది. సూర్య గ్రహణాలు చాలా వరకు అమావాస్య రోజున ఏర్పాడతాయి. కానీ ఈ సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రునిచే పూర్తిగా కప్పబడి ఉంటాడు. దీంతో సూర్యకిరణాలు భూమిని తాకలేవు. ఇక తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్ 30,2022న ఏర్పడనుంది. అయితే భారత్ లో కనిపించే తొలి సూర్యగ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్ నాసా విడుదల చేసిన డేటా ప్రకారం బ్లాక్ మూన్ అని పిలుచే ఖగోళ సంఘటనతో పాటు మరొకటి కూడాఉంది. బ్లాక్ మూన్ అనేది పగటిపూట కొంత సమంయ పాటు సూర్యకాంతిని భూమికి తాకకుండా నిరోధిస్తుంది.

ఈ సారిపాక్షిక సూర్యగ్రహం మే 01, 2022 అర్థరాత్రి 12: 15లకు ప్రారంభం అవుతుంది. కానీ భారత్ లో ఈ సూర్యగ్రహం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ఏర్పాడుతుంది. సాయంత్రం 06:37నిమిషాలకు ముగుస్తుంది.

సూర్య గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది…?
ఇది తొలి పాక్షిక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజుల, అంటార్కికా , దక్షిణ మహాసముద్ర ప్రాంతాల వాసులకు ఏప్రిల్ 30న సూర్యస్తమయానికి కొద్దిక్షణాల ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనా, నైరుతి బొలివియా, ఈశాన్యలోని పెరూ , నైరుతి బ్రెజిల్ దేశాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. సూర్యాస్తమయంలో పాక్షిక సూర్యగ్రహం కనిపించనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పాక్షిక సూర్యగ్రహాన్ని ఆన్ లైన్లో ఎలా చూడాలి..?
పాక్షిక సూర్యగ్రహం మే 01,2022ఉదయం 12:15 గంటలకు ప్రారంభమైన తెల్లవారుజామున 04:07కి ముగుస్తుంది. ఇది భారత్ లో కనిపించదు. కానీ మీరు నాసా ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ ద్వారా నాసా యానిమేషన్ ద్వారా ఆర్థోగ్రాఫిక్ మ్యాప్ లో ఆన్ లైన్ స్ట్రిమింగ్ ను చూడవచ్చు.

పాక్షిక సూర్యగ్రహం అంటే ఏమిటి?
పాక్షిక సూర్యగ్రహణం భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కనపించడు. దీని వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది.