Site icon HashtagU Telugu

Ooty Update : నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లే టూరిస్టులకు ఇవి తప్పనిసరి

Ooty Update

Ooty Update

Ooty Update : సమ్మర్ టైంలో మన దేశంలోని ఆకర్షణీయమైన టూరిస్టు డెస్టినేషన్ల జాబితాలో ఊటీ, కొడైకెనాల్ కూడా ఉంటాయి. అక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వెళ్తుంటారు. అయితే ఈసారి ఊటీ, కొడైకెనాల్‌లకు వెళ్లాలని భావించే వారు ఓ కొత్త అప్‌డేట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join

తమిళనాడులోని ఊటీ(Ooty Update), కొడైకెనాల్‌‌లకు వెళ్లేందుకు మే 7 (ఈరోజు) నుంచి జూన్ 30 వరకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేస్తూ ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.  ఆ రెండు ఏరియాలకు వెళ్లాలంటే టూరిస్టులు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఈ-పాస్‌ వాడాలి. పర్యాటకులు తమ వాహనాల నంబరు, వచ్చే రోజు, బస చేసే రోజులు, బస చేసే చోటు వంటి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడిస్తేనే ఈ-పాస్ జారీ అవుతుంది. epass.tnega.org  అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ-పాస్ పొందొచ్చు. ఊటీ, కొడైకెనాల్‌లకు వాహన రద్దీని క్రమబద్ధీకరించడానికే ఈ-పాస్ విధానాన్ని తీసుకొచ్చారు.ఊటీ, కొడైకెనాల్‌‌లకు వెళ్లే టూరిస్టులకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ-పాస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. చెక్ పోస్టులలోని సిబ్బంది వాటిని స్కాన్ చేస్తారు. నీలగిరి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ “టిఎన్ 43” కలిగి ఉన్న నీలగిరి జిల్లాలో నివసించే పౌరుల వాహనాలకు ఈ-పాస్ అవసరం లేదు.

Also Read :Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమిదీ..

ఊటీని నీలగిరి అని కూడా పిలుస్తారు. ‘నీలగిరి’ అంటే నీలి కొండలు (నీలం – నీలం గిరి – కొండ లేదా పర్వతం). ఈ పేరు యొక్క మొదటి ప్రస్తావన సిలప్పడికారం అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కనుగొన్నారు. కొండల అడుగున ఉన్న మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజల వల్ల నీలగిరి అనే పేరు వచ్చి ఉంటుందని, కొండ శ్రేణులను అప్పుడప్పుడు కప్పి ఉంచే ‘కురింజి’ పూలకు ఉండే ఊదారంగు పూల కారణంగా పర్వతాలకు ఈ పేరు వచ్చి ఉంటుందని ఒక నమ్మకం. 1789 లో నీలగిరి బ్రిటిష్ వారికి అప్పగించిన తర్వాత కోయంబత్తూరు జిల్లాలో భాగంగా మారింది. 1868 ఆగస్టులో కోయంబత్తూరు జిల్లా నుండి నీలగిరి వేరు చేశారు. జేమ్స్ విల్కిన్సన్ బ్రీక్స్ నీలగిరి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టాడు.1882 ఫిబ్రవరిలో నీలగిరిని ఒక జిల్లాగా చేసి కమిషనర్ స్థానంలో ఒక కలెక్టరును నియమించారు. 1882 ఫిబ్రవరి 1న అప్పటి కమీషనర్ గా ఉన్న రిచర్డ్ వెల్లస్లీ బార్లో నీలగిరి మొదటి కలెక్టరు అయ్యారు.

Also Read :LS Polls 2024: నేడే మూడో దశ లోక్‌సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు