Aadhar Card: ఆధార్ వినియోగదారులకు హెచ్చరిక.. ఈ నాలుగు పనులు చేస్తే అంతే సంగతులు!

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డ్. అయితే ఆధార్ కార్డును ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నమ్మదగిన డాక్యుమెంట్ గా భావిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 08:45 AM IST

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డ్. అయితే ఆధార్ కార్డును ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నమ్మదగిన డాక్యుమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఈ ఆధార్ కార్డు ద్వారా ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ని దృవీకరించుకోవచ్చు. కఆధార్ కార్డును గవర్నమెంట్ నఅందించే పథకాల కోసం అలాగే బ్యాంకు సర్వీసుల కోసం ఇలా ప్రతి ఒక్క విషయం కోసం ఈ రోజుల్లో ఆధార్ కార్డును తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే మనకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఆధార్ కార్డు లింక్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

పాన్ కార్డుకి, బ్యాంకు బుక్కుకి, మొబైల్ నెంబర్ కి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ కార్డు లింకు తప్పనిసరీ. అయితే ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ విషయంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల సమస్యలను ఎదుర్కొంటాం. ఆధార్ కార్డు విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. అలాగే ఆధార్ లెటర్, పీవీసీ కార్డు లేదా వీటి జిరాక్స్‌ లను జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం లాంటివి చేయాలి. కానీ ఆధార్ కార్డును ఇష్టానుసారంగా పడేయడం లాంటివి చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అలాగే ఎప్పుడు కూడా ఆధార్ కార్డును పబ్లిక్ ప్లేసులలో షేర్ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియా సైట్లలో ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయకూడదు. ట్విట్టర్,ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఆధార్ సమాచారాన్ని షేర్ చేయకూడదు. ఆధార్కు సంబంధించిన ఓటీపీని ఎవరికి చెప్పకూడదు. ఎవరైనా ఆధార్ ఓటిపిని అడిగినప్పుడు చెప్పకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా ఆధార్ జిరాక్స్, ఆధార్ నెంబర్, ఇ ఆధార్ లాంటి వాటిని ఎవ్వరికీ ఇవ్వడం, షేర్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఆధార్ కార్డు బయోమెట్రిక్స్‌ను అవసరం లేనప్పుడు లాక్ చేసుకొని పెట్టుకొని కావాలి అనుకున్నప్పుడు ఆన్‌లాక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. దీని వల్ల మీ ఆధార్ నెంబర్ ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండవు. ఆధార్ అథంటికేషన్ హిస్టరీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. అయితే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరైనా దుర్వినియోగం చేశారని భావిస్తే వెంటనే 1947 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.