Credit Card : క్రెడిట్ కార్డ్ లిమిట్, బిల్ సైకిల్‌పై కొత్త రూల్స్.. తెలుసా ?

Credit Card : క్రెడిట్ కార్డుల్ని అడ్డదిడ్డంగా వాడితే అంతే సంగతి !! అప్పుల కుప్పలు పేరుకుపోతాయి.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 09:51 PM IST

Credit Card : క్రెడిట్ కార్డుల్ని అడ్డదిడ్డంగా వాడితే అంతే సంగతి !! అప్పుల కుప్పలు పేరుకుపోతాయి. ఈఎంఐల భారం పెరిగిపోయి దివాలా తీస్తారు. వాటిని సక్రమంగా వాడితే ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. మంచి క్రెడిట్ హిస్టరీ కూడా తయారవుతుంది.  క్రెడిట్ కార్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిపై ఓ లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

మీ అనుమతి లేకుంటే..

క్రెడిట్ కార్డును(Credit Card) జారీ చేసే సంస్థలు కచ్చితంగా ఇకపై కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇస్తాయి. అప్లై చేసుకోకున్నా.. కార్డు పంపితే మాత్రం దాన్ని యాక్టివేట్ చేయొద్దు. కస్టమర్ల అభ్యర్థనతో.. 7 రోజుల్లో ఏ ఛార్జీ విధించకుండా సదరు జారీ సంస్థలు ఆ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను మూసేయాలి. ప్రాసెస్ పూర్తయ్యాక కస్టమర్లకు సమాచారం అందించాలి.

వాడకున్నా.. వాడినట్టే..

ఆర్థిక లావాదేవీలు చేయకపోయినా.. స్టేట్‌మెంట్లు తీయడం, పిన్ మార్చడం వంటివి ఏం చేసినా క్రెడిట్ కార్డు వినియోగంలో ఉన్నట్టే లెక్క.

పేమెంట్స్‌ విషయంలో మెలిక

మొత్తం క్రెడిట్ కార్డు బిల్‌ను టైంకు కట్టకపోతే వడ్డీ రహిత గడువు బెనిఫిట్ కోల్పోతారు. పాక్షిక చెల్లింపులు చేస్తే.. మిగతా మొత్తంపై ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి వడ్డీ పడుతుంది. ఇతర రుసుములు కూడా బకాయిలకే వర్తిస్తాయి. అంతేగానీ బిల్లు మొత్తానికీ వడ్డీ, ఇతర రుసుములు కట్టనక్కర్లేదు.

Also Read :Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి

బిల్లింగ్ సైకిల్

మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ ప్రారంభ, ఆఖరి తేదీలు కనీసం ఒక్కసారైనా మార్చుకునేందుకు కస్టమర్లకు సంస్థలు ఆప్షన్ ఇవ్వాలి. ఇంకా ఇ-మెయిల్, హెల్ప్‌లైన్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బిల్లింగ్ సైకిల్ మార్పు కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చు.

క్రెడిట్ లిమిట్‌

క్రెడిట్ కార్డుల్లో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే డీయాక్టివేట్ చేయొచ్చు. కస్టమర్‌కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం చేయొద్దు. ఇంకా ఓవర్ లిమిట్ ఛార్జీల్ని వేసే సమయంలో వడ్డీ, రుసుముల్ని క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు.

ఇన్సూరెన్స్

క్రెడిట్ కార్డులపై బీమా (ఇన్సూరెన్స్) కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఏం లేదు. అయితే సంస్థలు, నెట్‌వర్క్స్ తమ కస్టమర్లకు ఇవ్వాలనుకుంటే నామినీ సహా బీమా వివరాల్ని ప్రతి స్టేట్‌మెంట్లో కచ్చితంగా తెలియజేయాలి.

Also Read : Petrol Prices: ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర‌లు రూ. 100 కంటే ఎక్కువే..!