Assam VRS: అసోం ప్రభుత్వం సెన్సేషన్..300 మంది తాగుబోతు పోలీసులకు వీఆర్ఎస్

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయంతో సెన్సేషన్ సృష్టించింది. మద్యానికి అలవాటుపడిన దాదాపు 300 మంది పోలీసు ఆఫీసర్లు, జవాన్లకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - May 1, 2023 / 10:00 AM IST

Assam VRS: గౌహతి : అసోం ప్రభుత్వం కీలక నిర్ణయంతో సెన్సేషన్ సృష్టించింది. మద్యానికి అలవాటుపడిన దాదాపు 300 మంది పోలీసు ఆఫీసర్లు, జవాన్లకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ ఇచ్చింది. ఈవిషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదివారం వెల్లడించారు. అతిగా మద్యం సేవించడం వల్ల వారి శరీరాలు దెబ్బతిన్నాయని గుర్తించి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ ఇచ్చామని తెలిపారు. ఇది పాత రూలే కానీ.. తాము ఇంతకుముందు దీనిని అమలు చేయలేదన్నారు. వీరందరి స్థానంలో కొత్తవాళ్లను భర్తీ చేసుకునే ప్రక్రియను కూడా ప్రారంభించామని చెప్పారు.

“మేం అసోంలో పాలనా వికేంద్రీకరణపై దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా మొత్తం 126 శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నాం. దీనివల్ల ప్రభుత్వపరమైన పనుల కోసం ప్రజలు జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. నేరుగా డిప్యూటీ కమిషనర్ల కార్యాలయానికి వెళితే సరిపోతుంది” అని హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు.

Read More: Gujarat : సీఎం సభలో పడుకున్న అధికారి.. విధి నిర్లక్ష్యం అంటూ సస్పెండ్..