ADR report: టాప్ 3 `బ్లాక్ మ‌నీ` పార్టీలు మ‌న‌వే!

ఆసక్తికరంగా, దక్షిణాదిలోని పార్టీలు.. టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె మరియు జెడి(ఎస్) - గుర్తుతెలియ‌ని మూలాల నుండి అత్యధిక విరాళాల‌ను పొంద‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 01:07 PM IST

ఆసక్తికరంగా, దక్షిణాదిలోని పార్టీలు.. టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె మరియు జెడి(ఎస్) – గుర్తుతెలియ‌ని మూలాల నుండి అత్యధిక విరాళాల‌ను పొంద‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశంలోని మిగిలిన పార్టీల కంటే ద‌క్షిణాది ప్రాంత రాజ‌కీయ పార్టీలు ఆ జాబితాలో టాప్ లో ఉన్నాయి. ఈ జాబితాలో ఒడిశా అధికార బీజేడీ కూడా ఉంది.అన్నింటి కంటే అత్య‌ధికంగా గుర్తు తెలియ‌ని మూలాల నుంచి విరాళాలు సేక‌రించిన‌ నెంబ‌ర్ 1 పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉంది. టాప్ లో ఉన్న పార్టీలు వ‌రుస‌గా టిఆర్ఎస్ (రూ. 89.158 కోట్లు), టిడిపి (రూ. 81.694 కోట్లు), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (రూ. 74.75 కోట్లు), బిజెడి (రూ. 50.586 కోట్లు) మరియు డిఎంకె (రూ. 45.50 కోట్లు) గ‌త ఆర్థిక ఏడాది భారీ విరాళాల‌ను కూడ‌బెట్టుకున్నాయి.

ఇంచుమించు అన్నీ రాజ‌కీయ పార్టీలు విరాళాల రూపంలో పెద్ద ఎత్తున బ్లాక్ మ‌నీ ని వైట్ గా మార్చేసుకుంటున్నాయ‌ని ఏడీఆర్ నివేదిక‌లోని సారాంశం. ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో తెలియ‌కుండా ఉండే 95శాతం విరాళాలాలు ఎన్నిక‌ల బాండ్ల కింద ఆయా పార్టీలు ఆడిట్ లో చూపిస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాలలో 55% పైగా వ‌చ్చిన నిధుల‌ మూలాల‌ను చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, మూలాలు తెలియ‌కుండా వ‌చ్చిన నిధుల్లో 95% ఎలక్టోరల్ బాండ్‌ల రూపం సంత‌రించుకున్నాయి.

దేశంలోని ప్రాంతీయ పార్టీలు సేక‌రిస్తోన్న విరాళాల్లో 55శాతం నిధులు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో తెలియ‌డంలేద‌ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్ల‌డించింది. ఎన్నిక‌ల బాండ్ల ద్వారా చాలా వ‌ర‌కు నిధుల‌ను స‌మ‌కూర్చుకుంటున్నాయ‌ని తేల్చింది. పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీలు మోసం చేస్తున్నాయ‌ని ప‌రోక్షంగా ఏడీఆర్ నివేదిక స్ప‌ష్టం చేసింది. భారీగా నిధులు వ‌చ్చాయ‌ని రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ చీఫ్ మీడియా ముఖంగా వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. సుమారు 500కోట్ల వ‌ర‌కు పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు విరాళాల నిల్వ‌లు ఉన్నాయ‌ని చెప్పిన మ‌రుస‌టి రోజే ఏడీఆర్ నివేదిక వెల్ల‌డి కావ‌డం గ‌మ‌నార్హం.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 25 ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలు రూ. 803.24 కోట్లకు చేరుకోగా, వాటిలో రూ. 445.7 కోట్లకు వాటి మూలాలు తెలియ‌డంలేద‌ని నివేదిక పేర్కొంది. “తెలియని” మూలాల నుండి వచ్చిన విరాళాలలో, రూ. 426.233 కోట్లు (95.616%) ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చాయి. స్వచ్ఛంద సహకారం నుండి రూ. 4.976 కోట్లు జాతీయ పార్టీలకు “తెలియని” మూలాల నుండి వచ్చిన విరాళాలు. ఆ మొత్తంలో 70.98% వరకు మూలాలు తెలియ‌ని బాండ్ల నుంచి వ‌చ్చిన‌ట్టు నివేదిక తెలిపింది.

ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఆయా ప్రాంతీయ పార్టీలు అందించిన స‌మాచారం మేర‌కు తెలిసిన దాతల నుంచి స్వీకరించిన విరాళాలు మొత్తం రూ. 184.623 కోట్లుగా ఉంది. ఇది ఆయా పార్టీల‌ మొత్తం ఆదాయంలో 22.98% సభ్యత్వ రుసుములు, బ్యాంకు వడ్డీ, ప్రచురణల విక్రయం, పార్టీ లెవీ త‌దిత‌రాలు. ఇతర వనరుల నుండి మరో రూ. 172.843 కోట్లు (మొత్తం ఆదాయంలో 21.52%) పొందిన‌ట్టు అధికారిక స‌మాచారాన్ని ఈసీకి అందించాయి.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో, తమ వార్షిక ఆడిట్ మరియు సహకార నివేదికలను దాఖలు చేసిన 23 ప్రాంతీయ పార్టీల విరాళాల‌పై ఏడీఆర్ విశ్లేష‌ణ జ‌రిపింది. ఆ ఏడాది ఆ 25 పార్టీల మొత్తం ఆదాయం రూ. 885.956 కోట్లట్లు. అందులో రూ. 481.276 కోట్లు (54.32%) “గుర్తు తెలియని వారి నుండి వచ్చినవే.

విదేశీ నిధులు పొందే ఏ సంస్థ అయినా అభ్యర్థికి లేదా పార్టీకి మద్దతు ఇవ్వడానికి లేదా ప్రచారం చేయడానికి అనుమతించకూడదని నిబంధ‌న‌. సాధార‌ణంగా విరాళాల చెల్లింపు విధానం, కూపన్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, సభ్యత్వ రుసుములు మొదలైన వాటిని పార్టీలు ప్రకటించాలి. అంతేకాదు, ఆడిట్ నివేదికలు, I-T డిపార్ట్‌మెంట్ మరియు ECIకి సమర్పించాల‌నే నిబంధ‌న గురించి ఏడీ ఆర్ పేర్కొంది.
ఈ ఏడాది అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు కేరళలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రూ. 252 కోట్లు ఖర్చు చేయగా, అందులో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి రూ. 151.18 కోట్లకు పైగా వినియోగించినట్లు పార్టీ ఎన్నికల వ్యయ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు రూ.154.28 కోట్లు ఖర్చు చేసినట్లు టీఎంసీ సమర్పించింది. “రాజకీయ పార్టీల ఆదాయంలో చాలా వ‌ర‌కు దాత వివ‌రాల‌ను తెలప‌రు. దాతలందరి పూర్తి వివరాలను RTI క్రింద ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాల‌ని ADR పేర్కొంది. అప్పుడే రాజ‌కీయ పార్టీల విరాళాల భాగోతం బ‌హిర్గ‌తం అవుతుంది.