Progesterone Production: ప్రొజెస్టరాన్ ప్రొడక్షన్ పెంచే 5 ఫుడ్స్ ఇవే..!

ప్రొజెస్టరాన్ (Progesterone) అనేది ప్రొ-జెస్టేషన్ హార్మోన్. అంటే.. గర్భదారణకు అనుకూలంగా ఉండే హార్మోన్ ఇది. అంటే సాధారణంగా ఈ హార్మోన్ వల్లే మహిళలు గర్భం ధరిస్తారు. అందుకే మీ నెలసరి సమయంలో మహిళలకు చాలా ప్రొజెస్టరాన్ అందుతుంది.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 11:30 AM IST

ప్రొజెస్టరాన్ (Progesterone) అనేది ప్రొ-జెస్టేషన్ హార్మోన్. అంటే.. గర్భదారణకు అనుకూలంగా ఉండే హార్మోన్ ఇది. అంటే సాధారణంగా ఈ హార్మోన్ వల్లే మహిళలు గర్భం ధరిస్తారు. అందుకే మీ నెలసరి సమయంలో మహిళలకు చాలా ప్రొజెస్టరాన్ అందుతుంది. అలా మీలో చాలా నీరు నిల్వ ఉంటుంది. అది మీ వక్షోజాలు పెద్దగా అయ్యేలా చేస్తుంది. శరీరంలో ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచడానికి హెల్ప్ చేసే 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

శరీరంలో తక్కువ ప్రొజెస్టరాన్ స్థాయిలు ఉంటే ఋతు సమస్యలు , ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కు దారితీసే ఛాన్స్ ఉంటుంది. హార్మోన్లు అనేవి.. మీ శరీరంలోని కెమికల్ అంబాసిడర్స్. ఇవి జీర్ణక్రియ, నిద్ర మేల్కొనే చక్రాలతో సహా వివిధ రకాల భౌతిక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. ఈస్ట్రోజెన్‌తో పాటు రెండు ఆడ సెక్స్ హార్మోన్లలో ఒకటి ప్రొజెస్టెరాన్ ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమాన్ని నియంత్రిస్తుంది. గర్భధారణలో సహాయం చేస్తుంది. మహిళలు తీసుకునే ఫుడ్స్ కూడా పునరుత్పత్తి హార్మోన్ల పై ఎఫెక్ట్ చూపిస్తాయి. కొంతమందిలో ప్రొజెస్టెరాన్ లెవల్స్ తో బాధపడుతుంటారు. తక్కువ ప్రొజెస్టరాన్ స్థాయిలు ఉన్న స్త్రీలు క్రమరహిత పీరియడ్స్, తక్కువ లిబిడో, ఆందోళన, నిద్రలేమి, ఎముక క్షీణత , ఫైబ్రోసిస్టిక్ ఛాతీ (నొప్పితో కూడిన, ముద్దగా ఉండే రొమ్ములు) సమస్యలు ఎదుర్కొంటారు. దీన్ని పరిష్కరించడానికి మంచి ఫుడ్స్ తినాలి.

■ అరటిపండు

అరటిపండు మెగ్నీషియం యొక్క మంచి మూలం. ఇది ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది.  మెగ్నీషియం పిట్యూటరీ గ్రంధిని నియంత్రిస్తుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

■ వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌లో ప్లాంట్ స్టెరాల్స్ ఉంటాయి. ఇది మహిళల్లో ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వాల్‌నట్స్‌లో విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

■ బెండకాయలు

బెండకాయలు మెగ్నీషియం, జింక్ యొక్క గొప్ప మూలం. ఇవి ప్రొజెస్టరాన్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి అవసరమైన పోషకాలు.

■ గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది.ఇది ప్రొజెస్టరాన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

■ బాదం

బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది.

■ మెనోపాజ్ దశలో

మెనోపాజ్ దశలో స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. హార్మోన్లు అన్నవి రక్తం ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ.. శరీరంలోని అన్ని వ్యవస్థల్లో శారీరక, రసాయనిక చర్యలు ప్రారంభం, నిలిచిపోవడం, పెంచడం, తగ్గించడం వంటి చర్యలకు కారణమవుతాయి. మహిళల్లో ఓవరీలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తికి మూల కేంద్రం. ఈ రెండు హార్మోన్లు మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ అంటే రుతుచక్రం, సంతానోత్పత్తిని నిర్ణయిస్తాయి. మెనోపాజ్ సమయంలో ఒవేరియన్ ఫాలికుల్స్ తగ్గిపోతాయి. దీంతో ఓవరీలు పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లకు స్పందించడం తగ్గిపోతుంది. దీంతో మొత్తం మీద హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇదే మెనోపాజ్ దశలో ప్రధానంగా జరిగేది. ఇదే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.