Men Menopause: పురుషుల్లోనూ మెనోపాజ్.. లక్షణాలు, చికిత్సా పద్ధతులివీ

మెనోపాజ్ అనేది మహిళలకు సంబంధించిన విషయమని చాలామంది భావిస్తుంటారు. కానీ మగవారు కూడా స్త్రీలలా మెనోపాజ్ దశను ఫేస్ చేస్తారని చాలామందికి తెలియదు.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 07:15 AM IST

మెనోపాజ్ అనేది మహిళలకు సంబంధించిన విషయమని చాలామంది భావిస్తుంటారు. కానీ మగవారు కూడా స్త్రీలలా మెనోపాజ్ దశను ఫేస్ చేస్తారని చాలామందికి తెలియదు. ఈ దశను మగవారు 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఫేస్ చేస్తారు. ఈ సమయంలో హార్మోన్ లెవెల్స్ లో తగ్గుదల వస్తుంది. పురుషులు అందరిలోనూ ఈ దశ కనిపించదు. కొందరు మాత్రమే మేల్ మెనోపాజ్‌ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. మగవారిలో మెనోపాజ్ కు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తిగా షట్ డౌన్ అవ్వవు..

మేల్ మెనోపాజ్‌ దశలో కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పూర్తిగా షట్ డౌన్ అవ్వవు. అయితే హార్మోన్ లెవెల్స్ తక్కువవడం వల్ల సెక్సువల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 40 సంవత్సరాలు దాటినప్పటి నుంచి మగవారిలో ప్రతి సంవత్సరం యావరేజ్ గా 1 శాతం టెస్టోస్టెరోన్ లెవెల్ తగ్గుతూ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొంతమంది వృద్ధుల్లో ఇంకా టెస్టోస్టెరోన్ లెవెల్ నార్మల్ రేంజ్ లో ఉండటం. అంటే, మేల్ మెనోపాజ్ ను పురుషులందరూ ఎక్స్పీరియన్స్ చేయాలన్న రూల్ లేదు. ఈ ఫేజ్ ను మెడికల్ భాషలో “ఆండ్రో పాజ్” అని కూడా పిలుస్తారు. అంటే, మేల్ మెనోపాజ్ అన్నమాట.

లక్షణాలివి..

* ఆండ్రోపాజ్ లక్షణాలు మగవారి ఫిజికల్, సెక్సువల్, సైకాలజల్ ఫంక్షనింగ్ పై ప్రభావం చూపిస్తాయి. వారి ఇమ్యూన్ రెస్పాన్స్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది.

* విపరీతమై అలసట, బర్నవుట్, ఫిజికల్ స్ట్రెంత్ తగ్గిపోవడం వంటివి మనకు కనిపించే లక్షణాలు.

* ఈ దశకు చేరిన మగవారు ఎమోషనల్ గా ఆందోళన, డిప్రెషన్ అలాగే మూడ్ స్వింగ్స్ తో బాధపడతారు.

* డయాబెటిస్, హై స్ట్రెస్, పూర్ డైజెస్టివ్ సిస్టమ్, గట్ డిస్ఫంక్షన్, ఇన్ఫ్లమేషన్ వంటివి కూడా ఈ ఫేజ్ కు దారితీయవచ్చని అంటున్నారు.

* మగవారి మెనోపాజ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

* టెస్టోస్టెరోన్ అలాగే ఇతర హార్మోన్ లెవెల్స్ తగ్గుదల అనేది అనేక ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అవుతుంది.

* ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా సెక్సువల్ డిజైర్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ లెవెల్స్ తగ్గిపోవడం వంటివి ఈ దశకు చేరుకున్న వారిలో కామన్ గా కనిపించే లక్షణాలు.

ఎలా ట్రీట్ చేయాలి?

ఆండ్రోపాజ్ ను ట్రీట్ చేయడానికి ఓ థెరపీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాని పేరు బాడీ ఐడెంటికల్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఎప్పుడైతే మగవారిలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి తగినంత ఉండదో వారికి బాడీ ఐడెంటికల్ టెస్టోస్టెరోన్ రీప్లేస్మెంట్ థెరపీను రికమెండ్ చేస్తారు. ఈ థెరపీ ఇండివిడ్యుయల్స్ స్పెషల్ నీడ్స్ కు అనుగుణంగా పెర్సనల్ ఫార్ములేషన్స్ తో అందిస్తారు. ఇండియన్ జిన్సెంగ్, అశ్వగంధ వంటి హెర్బ్స్స్ ను వాడి ఆండ్రోపాజ్ ను ట్రీట్ చేయొచ్చంటున్నారు నిపుణులు.
వైద్యులతో కంఫర్టబుల్ గా సమస్య గురించి చెప్పుకోవాలి.టెస్టోస్టెరోన్ లెవెల్స్ ను తెలుసుకోవడానికి వైద్యులు బ్లడ్ టెస్ట్ ను సూచిస్తారు.
వైద్యులతో అన్ని విషయాలను పూర్తిగా చెప్పడం వలన పరిష్కారం లభిస్తుందని గుర్తించి మొహమాటాన్ని వీడాలి. సెక్సువల్ టాపిక్స్ ను కూడా డిస్కస్ చేయగలగాలి.

లైఫ్ స్టైల్ ఛేంజెస్..

మేల్ మెనోపాజ్ లక్షణాలను హెల్తీ లైఫ్ స్టైల్ తో తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ ను తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన డైట్ ను తినడం, వ్యాయామం చేయడం వంటివి ఆండ్రోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి. మంచి నిద్ర కూడా అవసరమే.