Site icon HashtagU Telugu

Influenza H3N2: దడ పుట్టిస్తున్న ఇన్ ఫ్లూయెంజా H3N2.. ఇవీ జాగ్రత్తలు..

Influenza H3n2 Causing Palpitation.. These Are The Precautions..

Influenza H3n2 Causing Palpitation.. These Are The Precautions..

వివిధ రాష్ట్రాలలో ఇన్ ఫ్లూయెంజా H3N2 (Influenza H3N2) కేసులు పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఇప్పటివరకు దాదాపు 10 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అకస్మాత్తుగా మారుతున్న వాతావరణ మార్పులతో ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పెరగడంతో పుదుచ్చేరిలోని పాఠశాలలకు మార్చి 16 నుంచి 26 వరకు సెలవులు ప్రకటించారు.

పిల్లలు H3N2 బారిన ఎందుకు పడుతున్నారు?

పిల్లలు H3N2 బారిన పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే.. వారి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. ఈ కారణం వల్లే వారు ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. పాఠశాలలో ఇతర వ్యాధి సోకిన పిల్లలతో తరచుగా కలవడం వల్ల H3N2 మరింత సులువుగా వ్యాపిస్తుంది.

ఇన్ ఫ్లూయెంజా H3N2 (Influenza H3N2) నివారణ లేదా చికిత్సకు యాంటీ బయోటిక్స్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వాటి అధిక వినియోగం వల్ల యాంటీ బయాటిక్ నిరోధకతకు దారి తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే.. అవసరమైన సమయంలో యాంటీ బయోటిక్స్ వాడినా వ్యాధిని తగ్గించేందుకు అవి హెల్ప్ చేయవు.

పిల్లలలో H3N2 ఇన్ఫెక్షన్ లక్షణాల విషయానికి వస్తే.. అధిక స్థాయి జ్వరం, చలి, దగ్గు, నోటితో శ్వాస తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరిగింది. శ్వాస లోపం, న్యుమోనియా, వీజ్ అసోసి యేటెడ్ లోయర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యల కారణంగా ఎక్కువ మంది పిల్లలు PICUలలో చేరాల్సి వస్తోంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటన ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి గలవారిలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, జబ్బుపడిన వ్యక్తులలో లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.

  1. ప్లస్ ఆక్సిమీటర్ సాయంతో ఆక్సిజన్ స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ ఉండండి.
  2. ఆక్సిజన్ సంతృప్త స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  3. ఆక్సిజన్ సంతృప్త స్థాయి 90 శాతం కంటే తక్కువగా ఉంటే, అప్పుడు ఇంటెన్సివ్ కేర్ అవసరం కావచ్చు.
  4. స్వీయ మందులు ప్రమాదకరం.
  5. పిల్లలకు, వృద్ధులకు జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

Also Read:  Recipes for Weight Loss: ఫాస్ట్‌గా బరువు తగ్గడానికి ఈ రెసిపీస్‌ ట్రై చేయండి..!