Fast Food : “ఫాస్ట్” ముప్పు ముంగిట పిల్లలు, టీనేజర్లు!!

తింటే శరీరానికి ఎనర్జీ బాగానే వస్తుంది. అయితే దానితో పాటు భారీగానే కొవ్వు, చక్కెర, ఉప్పు కూడా మన బాడీలోకి వస్తాయి.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 07:00 PM IST

తింటే శరీరానికి ఎనర్జీ బాగానే వస్తుంది. అయితే దానితో పాటు భారీగానే కొవ్వు, చక్కెర, ఉప్పు కూడా మన బాడీలోకి వస్తాయి. అవే మన హెల్త్ కి కొత్త ముప్పును సృష్టిస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డేంజర్ బెల్స్ ఇవీ..

* రెగ్యులర్ గా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయం, మానసిక సమస్యలు , దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి.
* ఫాస్ట్ ఫుడ్ భోజనం తింటే టీనేజర్లకు ఒక రోజుకు అవసరమైన దాని కంటే 160 కేలారీలు అందుతాయి.
* ఫాస్ట్ ఫుడ్ భోజనం తింటే పిల్లలకు ఒక రోజుకు అవసరమైన దాని కంటే 310 అదనపు కిలో కేలరీలు అందుతాయి.
* ఫాస్ట్ ఫుడ్ లోని అత్యధిక చక్కెర మోతాదు దంత సమస్యలను సృష్టిస్తుంది.
* ఫాస్ట్ ఫుడ్ లో A , C విటమిన్లు ,మెగ్నీషియం , కాల్షియం వంటి మినరల్స్ ఉండవు. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే ముప్పు ఉంటుంది.
* ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్‌లలో ప్రమాదకర ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్‌లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

* ఆస్తమా, ఎగ్జిమా ముప్పు

వారానికి మూడు సార్లు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆస్తమా, ఎగ్జిమా లేదా రినిటిస్ వంటి అటోపిక్ డిజార్డర్స్ వస్తాయి. అయితే టీనేజర్లలో ఆస్తమా తీవ్రత దాదాపు 40% ఎక్కువ . చిన్న పిల్లలలో 25% కంటే ఎక్కువ.జంక్ ఫుడ్ ఎక్కువగా తినని పిల్లలతో పోలిస్తే.. వారానికి 4-6 సార్లు జంక్ ఫుడ్ తిన్నవారిలో గణిత , పఠన నైపుణ్యాలు తగ్గాయని ఒక స్టడీలో తేలింది.

* మలబద్ధకం

పదే పదే భోజనంలో కేలరీలు, కొవ్వులు, చక్కెరలు, ఇతర కార్బోహైడ్రేట్ల అధిక మోతాదు అనేది పిల్లల ఆహార కోరికలను మారుస్తుంది . పిల్లవాడు పీచుపదార్థాలు, పండ్లు, పాలు , కూరగాయలను తినే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

* వ్యసనం

బాల్యంలో చాలా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల తరువాతి జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. సంబంధిత వైద్య సమస్యలు ఇప్పటికే స్పష్టంగా కనిపించిన ప్పటికీ, చిన్ననాటి ఆహారపు అలవాట్లు యుక్తవయస్సులో చెడు ప్రభావాలను బయటికి చూపించడం ప్రారంభిస్తాయి.

* హైపర్ యాక్టివిటీ

ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉండవు. ఒమేగా-3 , ఒమేగా-6 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు అంటారు. ఇవి మన శరీరంలో ఉత్పత్తి చేయబడవు. కానీ కణ త్వచాల తయారీకి, మెదడు, రెటీనాలకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు పెద్ద మోతాదులో అవసరం. అటువంటి పోషకాల కొరత వల్ల వ్యక్తుల ప్రవర్తన హైపర్ యాక్టివ్ గా మారుతుందని అంటారు. అయితే దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం.