Site icon HashtagU Telugu

Drinking Water: నీళ్లు తాగమన్నారు కదా అని ఎక్కువగా తాగితే మాత్రం ఆ సమస్యలు తప్పవు?

Mixcollage 04 Feb 2024 08 23 Pm 3832

Mixcollage 04 Feb 2024 08 23 Pm 3832

ఏ కాలంలో అయినా శరీరానికి సరిపడా నీరు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి రోజు తప్పకుండా 8 గ్లాసుల నీటిని తాగాలని చెబుతూ ఉంటారు. 8 గ్లాసుల కంటే ఎక్కువగా నీటిని తాగిన ఇంకా మంచిదే. అయితే నీరు తాగమన్నారు కదా అని ఎక్కువగా నీరు తాగితే మాత్రం పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎండాకాలంలో అదే పనికి నీళ్లు తాగేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ విధంగా ఎక్కువ నీళ్లు తాగటం వలన కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నీరు ఎక్కవుగా తాగటం వలన శరీరం నీటి మత్తుకు లోనవుతుంది. ఇది శరీరంలోని ఉప్పు, ఇతర ఎలక్ట్రోలైట్స్ ను పలచన చేస్తుంది. దీనితో సోడియం స్థాయి తగ్గిపోతుంది. సోడియం స్థాయి తగ్గిపోయినప్పుడు శరీరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని వలన మూత్రపిండాలు బలహీనమవుతునాయి. మైకం, వికారం, తలనొప్పి లాంటి లక్షణాలు బయటపడుతాయి. మరికొన్ని సందర్భాల్లో బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలా అతిగా నీరు తాగే లక్షణం మరింత పెరిగితే మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలి. రోజుకి సాధారణంగా 6 నుండి 8 గ్లాసుల నీరు తీసుకుంటే మంచిది.

వేసవి కాలంలో పది గ్లాసుల వరకు నీరు తీసుకోవాలి. దాహం వేసినప్పుడు మాత్రం నీరు తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు తాగాల్సి వస్తే, తక్కువ మోతాదులో నీరు తీసుకోవటం ఉత్తమం. కాబట్టి మన శరీరానికి నీరు ఎంత అవసరమో అంత వరకు మాత్రమే తీసుకోవాలి. అలా కాదు అని నీరు ఎలా పడితే అలా ఎన్ని పడితే అన్ని తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.