Brown Rice: బ్రౌన్ రైస్‌ వెయిట్ తగ్గిస్తుందా? షుగర్ కంట్రోల్ చేస్తుందా?

పాలిష్ చేయ‌బ‌డ్డ బియ్యం త్వ‌ర‌గా ఉడుకుతుంది. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 07:00 PM IST

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్‌ తింటే బరువు తగ్గుతారా ?

మధుమేహాన్ని నియంత్రించడంలో
బ్రౌన్ రైస్‌ సహాయపడుతుందా?

దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయ‌బ‌డని బియ్యం. సాధార‌ణంగా మ‌నం తినే వైట్ రైస్ బియ్యాన్ని చాలా సార్లు పాలిష్ చేస్తారు. అందుకే అవి తెల్ల‌గా ఉంటాయి. చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం అల‌వాటు చేసు కుంటున్నారు. దీంతో షుగ‌ర్‌ తో పాటు అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

◆ బ్రౌన్ రైస్.. డయాబెటిస్ వాళ్లకు ఎందుకు బెస్ట్ ?

పాలిష్ చేయ‌బ‌డ్డ బియ్యం త్వ‌ర‌గా ఉడుకుతుంది. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. అందుక‌నే బియ్యానికి పాలిష్ వేస్తారు. అయితే మ‌ర‌లో ఆడించిన బియ్యానికి ఒక్క‌సారే పాలిష్ వేయ‌గా వ‌చ్చే బియ్యాన్ని “బ్రౌన్ రైస్” అంటారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. ఈ బియ్యం ఉడికేందుకు ఎక్కువ టైం ప‌డుతుంది. ఈ రైస్‌ను తింటే త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వదు. ఎందుకంటే..ఇందులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నాన్ని కొంచెం తిన్నా క‌డుపు నిండుతుంది. ఇది అరిగేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కాబట్టి షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెర‌గ‌వు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అందుక‌నే షుగ‌ర్ ఉన్న‌వారు బ్రౌన్ రైస్ తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు.

◆ బ్రౌన్ రైస్.. 6 నెలల షెల్ఫ్ లైఫ్

అయితే బ్రౌన్ రైస్‌లో కొన్ని నెగెటివ్ అంశాలు కూడా దాగి ఉన్నాయి. అది కేవలం 6 నెలల షెల్ఫ్ లైఫ్ ను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ స్టాక్ తెచ్చుకుంటే.. 6 నెలల్లోగా క్లియర్ చేసుకోవాలి.
బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైటేట్ ఉంటుంది. ఇది కాల్షియం, ఐరన్ , జింక్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. బ్రౌన్ రైస్ ను నానబెట్టడం, పులియబెట్టడం ద్వారా మీరు ఈ లోపాలను భర్తీ చేయవచ్చు.కాగా, తెల్ల బియ్యాన్ని మిల్లింగ్ చేసి పాలిష్ చేయడం వల్ల పదేళ్ల వరకు నిల్వ ఉంటుంది.

◆ బియ్యం సరైన పద్ధతిలో ఎలా ఉడికించాలి?

అదనపు నీటిని ఉపయోగించి , పిండి పదార్ధాలను తీసివేయడం ద్వారా సాంప్రదాయ పద్ధతిలో బియ్యం ఉడికించడం ఎల్లప్పుడూ మంచిది. “స్టార్చ్ కాకుండా, ప్రతి వరి రకం కొన్ని ఆర్సెనిక్ కాలుష్యానికి గురవుతుంది.  కాబట్టి, బియ్యం రకం ఏదైనా సరే
దానిని సాంప్రదాయ పద్ధతిలో ఉడకబెట్టి.. నీటిని పారేయండి అని వైద్యులు చెబుతున్నారు.

◆ బ్రౌన్ రైస్‌ వర్సెస్ వైట్ రైస్

బ్రౌన్ రైస్‌కి మారడం వల్ల బరువు తగ్గుతుందా? అంటే.. వైద్య నిపుణులు అవును అని సమాధానం ఇస్తున్నారు. ఉదాహరణకు 1/3 కప్పుల బ్రౌన్ రైస్ ను, 1/3 కప్పుల వైట్ రైస్ ను తింటే బ్రౌన్ రైస్ ద్వారా 82 క్యాలరీలు ఎనర్జీ వస్తుంది. ఇక వైట్ రైస్ ద్వారా 68 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్లు బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో క్యాల్షియం, ఐరన్ తక్కువే.
వైట్ రైస్ లో ఫైబర్ 0.2 గ్రాములు ఉంటే.. బ్రౌన్ రైస్ లో అది కేవలం అత్యధికంగా 1.1 గ్రాము దాకా ఉంటుంది. వైట్ రైస్ లో ప్రోటీన్స్ 1.42 గ్రాముల ఉంటే.. బ్రౌన్ రైస్ లో కొంచెం ఎక్కువగా 1.83 గ్రాములు ఉంటాయి.

◆ విసెరల్ ఫ్యాట్ పెరగకుండా బ్రేక్

బ్రౌన్ రైస్ మన శరీరంలో విసెరల్ కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. విసెరల్ ఫ్యాట్ ను బెల్లీ ఫ్యాట్ అని కూడా పిలుస్తారు. ఇది మన పొట్ట పై భాగంలో, కడుపులోని పేగుల మధ్య పెరుకుపోతుంది. ఫలితంగా లావు పెరిగి ఊబకాయం వస్తుంది.దీంతో బరువు కూడా పెరిగిపోతుంది.ఇక మీ షుగర్ లెవల్ ను కూడా బ్రౌన్ రైస్ కంట్రోల్ లో ఉంచుతుంది.

◆ ఈ పోషకాలతో హెల్త్ కు హెల్ప్

బ్రౌన్ రైస్‌లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, థయామిన్, బి విటమిన్లు, B 3, B6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంగనీస్ , సెలీనియం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది అని వైద్య నిపుణులు వివరించారు.వైట్ రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 73 ఉండగా.. బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 మాత్రమే. తక్కువ
గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఫుడ్స్ షుగర్ రోగులకు బెస్ట్.

◆ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ?

ఆహారం తిన్న తర్వాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేదే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ). దీనిని పాయింట్లలో లెక్కిస్తారు.మనం తిన్న ఆహారం త్వరగా అరిగి వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలిస్తే హైగ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. నెమ్మదిగా మారితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తారు. పాలిష్ పట్టిన తెల్లని వరి అన్నం, తెల్ల ఇడ్లీలు హైగ్లైసెమిక్ ఇండెక్స్
ఆహారం. వైట్ బ్రెడ్, మైదా ఆహార పదార్ధాలు,బార్లీ గింజలలో గ్లైసిమిక్ ఇం…