Corona Virus : కరోనా వైరస్ ఎలా సోకుతుందో కనిపెట్టిన సీసీఎంబీ.. తేనెటీగల విషమే విరుగుడా?

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 10:52 AM IST

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతోంది. అసలు ఈ వైరస్ ఎలా సోకుతుందో అని కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన సీసీఎంబీ, చండీగఢ్ లోని ఐఎంటెక్ లు మరింత లోతుగా పరిశోధన చేశాయి.

ఈ రెండు సంస్థలు కొన్ని ఆసుపత్రులతో కలిసి పరిశోధన చేశాయి. గాలిలోని కరోనా వైరస్ కణాలు మనుషులకు సోకుతాయని వీరి పరిశోధనలో తేలింది. అంటే గాలి ద్వారానే వైరస్ ఎక్కువగా సోకుతోందని నిర్థారణకు వచ్చారు. హైదరాబాద్, మొహలీలలో కొవిడ్ రోగులు ఉన్న ఆసుపత్రులతోపాటు కరోనా వైరస్ సోకిన రోగులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న మూసి ఉంచిన గదులు, ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారి
గృహ సముదాయాల్లో గాలి నమూనాలను సేకరించారు. వీటిలో కరోనా వైరస్ జన్యుపదార్థాలను పరిశీలించారు.

కొవిడ్ రోగులు ఉన్న ప్రాంతంలోని గాలిలో వైరస్ ఎక్కువగా ఉంటుంది. రోగులు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతంలో పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది. ఐసీయూతోపాటు ఇతర వార్డుల్లోనూ వైరస్ ఆనవాళ్లు లభించాయి. రోగికి ఎంత ఇన్ ఫెక్షన్ ఉంది అన్నదానితో సంబంధం లేకుండా వైరస్ ను వ్యాప్తి చేస్తారు. గాలిలో వైరస్ ఎక్కువ దూరం వ్యాపిస్తుందని వీరి పరిశోధనలో తేలింది. ఏరో సోల్ సైన్స్ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. ఒక గదిలో ఒక కొవిడ్ రోగి ఉంటే 15.8 శాతం, ఇద్దరు లేగా అంతకన్నా ఎక్కువమంది ఉంటే 75 శాతంగా పాజిటివిటీ రేటు ఉందని వీరి పరిశోధనలో తేలింది.

తేనెటీగలు కుట్టేటప్పుడు అది విసర్జించే పదార్థంలో ఎంజైమ్‌లు, మినరల్స్‌, షుగర్‌, అమైనో యాసిడ్‌లు ఉంటాయి. వీటిలో అమైనో యాసిడ్‌లో పెప్టైడ్స్ పై సీసీఎంబీ పరిశోధన చేసింది. దీంతో కొవిడ్ ట్రీట్ మెంట్ కు ఉపయోగించే యాంటీ బ్యాక్టీరిల్ పెప్టైడ్స్ తేనెటీగల విషంలో ఉన్నట్టు సీసీఎంబీ గుర్తించింది. వీటిని ల్యాబ్ లోని వైరస్ పై ప్రయోగించింది. దీంతో ఇది వైరస్ లోడును అనూహ్యంగా 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే తగ్గించింది.