Carb Cycling: హాట్ టాపిక్ గా “కార్బ్ సైక్లింగ్”.. ఇంతకీ ఏమిటది ?

ఇటీవల కాలంలో "కార్బ్ సైక్లింగ్"పై బాగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాడీబిల్డర్లు కార్బ్-సైక్లింగ్ డైట్ యొక్క ఆలోచనను బాగా ఫేమస్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 06:15 AM IST

Carb Cycling: ఇటీవల కాలంలో “కార్బ్ సైక్లింగ్”పై బాగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాడీబిల్డర్లు కార్బ్-సైక్లింగ్ డైట్ యొక్క ఆలోచనను బాగా ఫేమస్ చేస్తున్నారు.దీంతో ఈ డైట్ బాగా ప్రజాదరణ పొందుతోంది. ఈనేపథ్యంలో కార్బ్ సైక్లింగ్ డైట్ అనేది ఉపవాసం యొక్క కొత్త రూపమని కొందరు చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో వర్కవుట్ లు, కార్బోహైడ్రేట్ల వినియోగం, కేలరీల లెక్కింపు అనేవి కలిసి ఉంటాయి. అందుకే దీన్ని ఉపవాసం అనడం సరికాదు. “కార్బోహైడ్రేట్లు అందడం తగ్గితే.. తగినంత ఎనర్జీ కలిగిన ఫుడ్ అందటం లేదని మన శరీరం భావిస్తుంది. బాడీలో ఉండే కొవ్వు కరుగుతోందని అనుకుంటుంది. ఆ వెంటనే గ్లైకోజెన్ నిల్వలను అవసరమైన శక్తిగా, కొవ్వుగా శరీరం మారుస్తుంది” అని కార్బ్ సైక్లింగ్ డైట్ గురించి ఒక వైద్య నిపుణుడు వివరించారు. కార్బ్ సైక్లింగ్ డైట్ లో భాగంగా తీసుకునే “లో కార్బ్ ఫుడ్స్” అనేవి కండరాల పెరుగుదలకు, ఫిట్ నెస్ ను పెంచేందుకు హెల్ప్ చేస్తాయి.

2017 స్టడీ రిపోర్ట్..

2017లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం..కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ను తీసుకోవడాన్ని తగ్గిస్తే బాడీలోని గ్లైకోజెన్ నిల్వల వినియోగం పెరుగుతుంది. ఉదాహరణకు.. రెండు రోజులు ఒక వ్యక్తి 200 గ్రాముల కార్బోహైడ్రేట్లను తీసుకుంటే.. ఆ తరువాతి రెండు రోజులు 100 గ్రాముల కార్బోహైడ్రేట్లు, మరుసటి రోజు 80 గ్రాములు ఉండవచ్చు. వ్యక్తి యొక్క డైట్ ప్లాన్ ప్రకారం.. అతడికి ఎంతమేర కేలరీలు అవసరం అనే దాని ఆధారంగా
కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంతమేర తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు.

16/8 ప్లాన్..

ఈ డైట్ ను ఫాలో కావాలని భావించే వారు 16/8 ప్లాన్ అమలు చేయొచ్చు. ఇందులో భాగంగా ఎనిమిది గంటలు తినడం, 16 గంటలు ఉపవాసం ఉండాలి.ఈ టైంలో కేలరీలు తీసుకోకూడదు. కానీ గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి జీరో కేలరీల ఆహారాన్ని తీసుకోవచ్చు. తినే ఎనిమిది గంటల్లో లో కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకోవచ్చు.  ఎక్కువ కాలం ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు వినియోగింప బడుతుంది.జీర్ణ క్రియలు మెరుగుపడుతాయి.కొవ్వు తగ్గడం మొదలు అవుతుంది. దీంతో శరీరం కీటోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కీటోన్‌లను మెదడు శక్తి వనరుగా ఉపయోగిస్తుంది.
ఈ డైట్ ప్లాన్ వల్ల బాడీలో చక్కెర తగ్గుతుంది. బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ తగ్గుతుంది.క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు  కార్బ్ సైక్లింగ్ వల్ల.. శరీరంలోని టాక్సిన్ స్థాయిలు తగ్గుతాయి.

ఎవరు చేయాలి.. ఎవరు చేయకూడదు?

డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ కాలం(16 గంటలు) ఉపవాసం ఉండలేరు. ఒకవేళ ఉంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే డయాబెటిక్ పేషెంట్లు ఈ డైట్ ఫాలో కావాలి. విశ్రాంతి తీసుకునే ఎవరైనా కార్బ్ సైక్లింగ్, అడపాదడపా ఉపవాసాలను అనుసరించవచ్చు.

ఫుడ్ ప్లాన్..

*కాంప్లెక్స్ పిండి పదార్ధాలలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు మరియు బంగాళదుంపలు వంటి పిండి పదార్థాలు ఉంటాయి.

* తృణధాన్యాలలో రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు తీసుకోవాలి.

* అరటిపండ్లు, మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ యాపిల్స్, బొప్పాయిలు, కివీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. టోన్డ్ మిల్క్ ను తాగితే బెస్ట్.

* మాంసాహారం కేటగిరిలో చికెన్ మరియు చేపలు బెస్ట్.

* పప్పు దినుసులలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.