Site icon HashtagU Telugu

Benefits with Sneezing : తుమ్ము వస్తే తుమ్మేయండి.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా ?

sneezing

sneezing

Benefits with Sneezing : జలుబు చేసినప్పుడు తుమ్ములు రావడం కామన్. ఎక్కువగా తుమ్మడం వల్ల ముక్కు మంట, తలనొప్పి వంటివి వస్తుంటాయి. కానీ.. తుమ్ములు రావడం వల్లే జలుబు త్వరగా తగ్గుతుందంటున్నారు నిపుణులు. తుమ్ములు రావడం కూడా ఆరోగ్యానికి మంచిదేనట. జలుబు చేసినపుడే కాదు.. మిగతా సమయాల్లోనూ తుమ్ములు వస్తుంటాయి. దుమ్ము, వాతావరణంలో మార్పు వచ్చినపుడు తుమ్ములు వస్తాయి. అయితే..తుమ్ముల వెనుక కూడా ఆరోగ్య రహస్యం ఉందని మీకు తెలుసా ? తుమ్ముల్లో ఆరోగ్యం ఏంటనుకుంటున్నారా ? తెలుసుకుందాం.

జలుబు ఉన్నప్పుడు తుమ్ములు ఎక్కువగా రావడం కామన్. ఇది ముక్కు, మెదడు, శరీరంలో వివిధ కండరాల మధ్య జరిగే సంక్లిష్టమైన పరస్పర చర్య. ఇదొక రిఫ్లెక్స్ చర్య. మీ నియంత్రణతో సంబంధం లేని చర్య. తుమ్ము వచ్చే ముందు.. మనకు తెలిసినా దానిని ఆపడం అసాధ్యం. అలాగే తుమ్మేటపుడు ఆటోమెటిక్ గా మన కళ్లు మూసుకుపోతాయి. కళ్లు తెరిచి ఉండగానే తుమ్మాలని ఎంత ట్రై చేసిన అది సాధ్యం కాని పని.

తుమ్ములకు గాలిలో ఉండే కణాలు మాత్రమే కారణం కాదు. అకస్మాత్తుగా కాంతికి గురైనప్పుడు కూడా కొందరికి తుమ్ములొస్తాయి. దీనిని ఫొటో స్నీజ్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. తుమ్మినపుడు మన గుండె కొన్ని మిల్లీ సెకన్లపాటు పనిచేయడం ఆగిపోతుంది. ఇది మీరు గ్రహించరు. అందుకే తుమ్ము వచ్చినపుడు ఎంత వేగంగా తుమ్మితే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు తుమ్మడం వలన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. కొన్ని రకాల వైరస్ ల నుంచి రక్షణ లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తుమ్మును అస్సలు ఆపుకోకూడదు.

తుమ్మును బలవంతంగా ఆపితే.. అనర్థమేనట. గతేడాది ఏప్రిల్ లో యూఎస్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తన తుమ్మును బలవంతంగా ఆపడంతో.. గొంతులో చిన్నరంధ్రం ఏర్పడింది. డ్రైవింగ్ లో ఉండగా.. తుమ్మును ఆపేందుకు ప్రయత్నించడంతో గొంతులో చిన్న రంధ్రం ఏర్పడింది. తుమ్మును ఆపడం వల్ల గొంతుపై 40 శాతం ఒత్తిడి పడింది. దీంతో అతని గొంతులో రంధ్రం ఏర్పడింది. కాబట్టి మీరు తుమ్మును బలవంతంగా ఆపే ప్రయత్నం చేయకండి.

Also Read : Anant Ambani Weight : అనంత్ అంబానీ అంత బరువు పెరగడానికి కారణమేంటో తెలుసా ?