Covid Vaccines : మా కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైందే : ఆస్ట్రాజెనెకా

Covid Vaccines : ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్  వ్యవహారం కలకలం రేపుతోంది. 

Published By: HashtagU Telugu Desk
AstraZeneca

AstraZeneca

Covid Vaccines : ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్  వ్యవహారం కలకలం రేపుతోంది.  ఈ వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని స్వయంగా ఆస్ట్రాజెనెకా ఇటీవలే బ్రిటన్‌లోని ఓ కోర్టుకు తెలిపింది.ఈ టీకాను మన దేశంలో ‘కొవిషీల్డ్’ పేరుతో ప్రజలకు అందించారు.  అందుకే ఈ వ్యవహారంతో మన దేశ ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనెకా  పూర్తి వివరణతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. తమ కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

మనుషులు, ఎలుకలు, కోతులపై నిర్వహించిన  ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని తేల్చి చెప్పింది.  దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. రోగుల భద్రతకే తాము ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఔషధ నియంత్రణ సంస్థల ఆరోగ్య ప్రమాణాలను తప్పక పాటిస్తామని చెప్పింది. మరోవైపు ప్రపంచంలోని అన్ని దేశాల ఔషధ నియంత్రణ సంస్థలు నేటికీ కరోనా వ్యాక్సిన్లను సమర్ధిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య భద్రత కంటే.. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చాలా తక్కువేనని వాదిస్తున్నాయి.

Also Read : Bomb Threat Emails : పెద్దసంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. రాజధానిలో కలకలం

  • ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్(Covid Vaccines) ఫార్ములాతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకాను తయారు చేసింది. దాని పేరే కొవిషీల్డ్.
  • ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించగా.. కొవిషీల్డ్ టీకా తయారీకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించింది.
  • ఇందులో భాగంగా కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను మనుషుల రోగ నిరోధక కణాల్లోకి తీసుకెళ్లేందుకు వాహకంగా చింపాంజీ అడినోవైరస్‌ను వినియోగించారు. ఇది మన శరీరంలోకి ప్రవేశించి కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలి అనేది మన రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తుంది.

Also Read :Godrej Family : 127 ఏళ్ల చరిత్ర కలిగిన ‘గోద్రెజ్’‌లో చీలిక.. ఎవరెవరికి ఏయే వ్యాపారం ?

  Last Updated: 01 May 2024, 11:53 AM IST