Site icon HashtagU Telugu

Jyeshtha Month: హిందూ క్యాలెండర్‌లో మూడో నెల షురూ.. వ్రతాలు, పండుగల లిస్ట్ ఇదే

jyeshtha Month

jyeshtha Month

హిందూ క్యాలెండర్‌లో మూడో నెల జ్యేష్ఠ మాసం(Jyeshtha Month 2023). ఇది మే 6 నుంచే ప్రారంభమైంది. వైశాఖ మాసం ముగిసిన వెంటనే జ్యేష్ఠ మాసం(Jyeshtha Month 2023) ప్రారంభమవుతుంది. ఈ మాసంలో సూర్యుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. అంటే ఎండలు బాగా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠత అంటే హెచ్చు స్థాయి. సూర్యుడి జ్యేష్ఠత కారణంగా ఈ మాసానికి జ్యేష్ఠ మాసం(Jyeshtha Month 2023) అనే పేరు వచ్చింది. ఈ మాసంలో సూర్యుడు, వరుణుడికి పూజలు చేసే మంచి ఫలితాలు వస్తాయి. ఈసారి జ్యేష్ఠ మాసం(Jyeshtha Month 2023) మే 6 నుంచి జూన్ 4 వరకు ఉంటుంది. జూన్ 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది.

శాస్త్రీయ ప్రాముఖ్యత ఇదీ..

జ్యేష్ఠ మాసంలో వాతావరణం వేడెక్కుతుంది. చెరువులు, నదుల్లో నీటిమట్టాలు తగ్గిపోవడం మొదలవుతుంది. కాబట్టి ఈ టైంలో నీటిని సక్రమంగా, తగినంతగా ఉపయోగించుకోవాలి. వడ దెబ్బకు గురికాకుండా.. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో పచ్చి కూరగాయలు, సత్తు పిండి, సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ తింటే మేలు, ఈ నెలలో మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

వరుణుడు, సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు..

ఈ నెలలో ప్రతిరోజు ఉదయం, వీలైతే సాయంత్రం కూడా మొక్కలకు నీళ్లు పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేయండి. నీటిని వృధా చేయొద్దు. నీటి కుండలు, ఫ్యాన్లు దానం చేయండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సూర్య మంత్రాన్ని జపించండి. సూర్యునికి సంబంధించిన దోషం ఉంటే.. ప్రతి ఆదివారం జ్యేష్ఠ ఉపవాసం ఉండండి. ఇవన్నీ చేయడం వల్ల మీరు వరుణుడు, సూర్యుడిని ప్రసన్నం చేసుకోగలుగుతారు.

ALSO READ : Ugadi: ఉగాది వస్తోంది.. ఈసారి ఎన్ని మాసాలు? శుభ ముహూర్తం ఏమిటి?

జ్యేష్ఠ మాస పూజా విధానం ఇదీ..

జ్యేష్ఠ మాసం రోజున స్నానం, ధ్యానం, పుణ్యకార్యాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల పెళ్లిళ్లకు ఎదురయ్యే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈరోజున శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి. రావి చెట్టును పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. రావి చెట్టుపై విష్ణువు సమేతంగా లక్ష్మీదేవి నివసిస్తుందని భక్తుల విశ్వాసం.

జ్యేష్ఠ మాసంలో చేయవలసినవి.. చేయకూడనివి

1. ఈ మాసంలో బాల గోపాలుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మిశ్రి, తులసి ఆకులతో మఖన్ మిశ్రీ తయారు చేసి బాల గోపాలుడికి సమర్పించి, చందనం పూయండి. ఆయన మీపై ప్రసన్నుడు అవుతాడు.

2. జంతువులు, పక్షులకు నీటి ఏర్పాట్లు చేయండి.

3. బాటసారులకు నీటి వసతిని ఏర్పాటు చేయవచ్చు.

4. గొడుగులు, ఆహారం, పానీయాలు మొదలైన వాటిని దానం చేయవచ్చు.

5. గోశాలకు పచ్చి గడ్డిని దానం చేయండి.

6. శివలింగానికి జలాభిషేకం చేయండి.

7. ఈ హనుమంతుడిని ఆరాధించడం శుభప్రదం. ఎందుకంటే శ్రీరాముడిని హనుమంతుడు కలిసింది జ్యేష్ఠ మాసంలోనే.

జ్యేష్ఠ మాసం(Jyeshtha Month 2023)లో ఉపవాసాలు, పండుగల లిస్ట్

* మే 6, శనివారం – కృష్ణ పక్షం ప్రారంభం
* మే 7, ఆదివారం – దేవర్షి నారద జయంతి
* మే 9, మంగళవారం – అంగార్కి చతుర్థి
* మే 12, శుక్రవారం – శీతలాష్టమి
* మే 15, సోమవారం – అపర ఏకాదశి
* మే 17, బుధవారం – ప్రదోష వ్రతం
* మే 19, శుక్రవారం – వట్ సావిత్రి వ్రతం, శని జయంతి
* మే 20, శనివారం – శుక్ల పక్షం ప్రారంభం, కర్వీర వ్రతం
* మే 22, సోమవారం – పార్వతి పూజ
* మే 23, మంగళవారం – వైనాయకి గణేష్ చతుర్థి
* మే 24, బుధవారం – శ్రుతి పంచమి
* మే 30, మంగళవారం – గంగా దసరా
* మే 31 , బుధవారం – నిర్జల ఏకాదశి
* జూన్ 1, గురువారం – చంపక్ ద్వాదశి
* జూన్ 4, ఆదివారం – పౌర్ణమి, కబీర్ జయంతి

Exit mobile version