Ganesh Festival: గణేష్ ఉత్సవాలు ఎప్పుడూ మొదలయ్యాయో తెలుసా..?

భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు వినాయకుడు. అలాంటి గణేషుడికి ఇప్పుడైతే రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, ఆర్భాటంగా ఉత్సవాలు (Ganesh Festival) నిర్వహిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 01:14 PM IST

Ganesh Festival: భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు వినాయకుడు. అలాంటి గణేషుడికి ఇప్పుడైతే రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్ దీప కాంతుల్లో హంగూ ఆర్భాటంగా ఉత్సవాలు (Ganesh Festival) నిర్వహిస్తున్నారు. ఇక ఈ భారీ ఖాయుడు ఎంత ఎత్తు ఉంటే అంత పేరు. మరి ఒకప్పుడు ఈ వినాయక ఉత్సవాలు ఎలా ఉండేవి..? నవరాత్రుల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది..? భక్తితో పాటు స్వాతంత్య్ర కాంక్ష కూడా దాగున్న చరిత్ర ఏంటి..? భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ పెద్ద ఎత్తున గణేశ్ ఉత్సవం జరుపుకోవడానికి పునాది వేసినట్లు చెబుతారు.

1890వ దశకంలో స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్ని ఎలా సంఘటితం చేయాలని తిలక్ ఆలోచిస్తూ ఉండేవారట. అందరూ కలిసి గణపతి పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గమని ఆయన భావించారట. మహారాష్ట్రలో పీష్వాలు గణపతిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో గణపతి ఉత్సవాలు ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచనల్లోంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 1893లో ఈ గొప్ప వేడుకలకు పునాది పడింది. మండపాలలో గణేశుడి పటాలు, పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినే మొదటి వ్యక్తిగా తిలక్ గుర్తింపు పొందారు. 10వ రోజున భారీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించారని చెబుతారు.

Also Read: Silver Medal: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం.. సెయిలింగ్ ఈవెంట్‌లో రజతం

అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించడానికి ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ సమాఖ్య పండగగా చవితి వేడుకను జరిపారు. పేద‌, ధ‌నిక‌, వ‌ర్ణ భేదాలు లేకుండా అంద‌రూ ఏకతాటి పైకొస్తారని ఆశించారు. సామూహికంగా వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తార‌త‌మ్యాలు ఏర్పడవని తిలక్‌ నమ్మారు. అంతా ఐక‌మ‌త్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ విశ్వసించారు. అలా చవితి వేడుక‌ల‌ను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు.

గణేశ్ చతుర్థి వేడుకలు 271 BC నుంచి 1190 AD వరకు పాలించిన శాతవాహన, రాష్ట్ర కూట, చాళుక్య రాజవంశాల పాలన నాటివని కొందరు చరిత్రకారులు చెబుతారు. చత్రపతి శివాజీ ఈ వేడుకలను ప్రోత్సహించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1905 తర్వాత దేశమంతటా గణేశ్ ఉత్సవాలు జరపడం మొదలుపెట్టారు.